HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp Brs Hate Minorities Mp Chamala Kiran Kumar Reddy

MP Chamala: మైనార్టీలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ విద్వేషం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

భారత క్రికెట్ కెప్టెన్‌గా ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను నిలబెట్టిన అజారుద్దీన్‌కు రాష్ట్ర కేబినెట్‌లో చోటు కల్పిస్తుంటే ఈ రెండు పార్టీలు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాయని చామల ప్రశ్నించారు.

  • Author : Gopi Date : 30-10-2025 - 8:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MP Chamala
MP Chamala

MP Chamala: తెలంగాణ కేబినెట్‌లో మైనార్టీలకు మంత్రి పదవి దక్కకుండా బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ కేబినెట్‌లో కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ నేత, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు చోటు కల్పిస్తుంటే దాన్ని ఓర్వలేక రెండు పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.

అజారుద్దీన్ మంత్రి పదవికి అడ్డుకునే కుట్ర

కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్ర ఉద్య‌మ‌కాలం నుంచే లౌకికవాదంతో ముందుకు సాగుతోందని ఎంపీ చామల అన్నారు. అయితే, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ధ్వజమెత్తారు. “మైనార్టీలంటే ఎందుకంత కడుపుమంట? తెలంగాణ కేబినెట్‌లో మైనార్టీ మంత్రి ఉండొద్దా? రాజకీయ లబ్ది కోసం మతాల మధ్య చిచ్చు పెడతారా?” అంటూ బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో మైనార్టీ నాయకుడిగా ఎదిగిన అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలన్న కాంగ్రెస్ నిర్ణయానికి అడ్డుకట్ట వేయడానికి బీజేపీ, బీఆర్‌ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయని చామల విమర్శించారు.

Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్ల‌నున్నాడా? అస‌లు నిజం ఇదే!

బీజేపీ నేతలు ప్రత్యక్షంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడమే ఈ కుట్రకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కేవలం ఫిర్యాదుతోనే ఆగకుండా అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కకుండా ఉండేందుకు గవర్నర్‌పై కూడా ఒత్తిడి తెచ్చి మంత్రివర్గ విస్తరణ జరగకుండా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ మైనార్టీ సోదరులు ఈ కుట్రను గుర్తించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.

బీజేపీ-బీఆర్‌ఎస్‌ల మధ్య లోపాయికారీ ఒప్పందం

గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలవడానికి బీఆర్‌ఎస్‌తో చేసుకున్న అంతర్గత ఒప్పందమే కారణమని చామల ఆరోపించారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదన్న కుట్రతోనే ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయన్నారు. గతంలో ఈ రెండు పార్టీలు చేసిన కుట్రలను కేసీఆర్ కూతురైన కవిత గారే ఎన్నో వేదికలపై బయటపెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలనే లక్ష్యంతోనే ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయని, సర్వేల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటర్లు ఉన్నారని తేలడంతోనే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.

బీజేపీ ద్వంద్వ వైఖరిపై విమర్శ

భారత క్రికెట్ కెప్టెన్‌గా ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను నిలబెట్టిన అజారుద్దీన్‌కు రాష్ట్ర కేబినెట్‌లో చోటు కల్పిస్తుంటే ఈ రెండు పార్టీలు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాయని చామల ప్రశ్నించారు. ఇటీవల ఎర్రగడ్డ వద్ద మైనార్టీలకు ఖబరిస్తాన్ (స్మశానవాటిక) కోసం స్థలం కేటాయిస్తే కూడా ఈ రెండు పార్టీలు జనాన్ని రెచ్చగొట్టాయని గుర్తు చేశారు. బీజేపీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ గత ఏడాది జనవరిలో రాజస్థాన్‌లో జరిగిన ఉపఎన్నికల్లో శ్రీకరణ్‌పూర్ నియోజకవర్గంలో సురేందర్‌పాల్ సింగ్ అనే వ్యక్తికి 20 రోజుల ముందు అభ్యర్థిగా ఖరారు చేసి, ఆ వెంటనే మంత్రి పదవి కూడా ఇచ్చారని “వారు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పా?” అంటూ బీజేపీ నేతలను ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సాకుతో మైనార్టీలను దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తుంటే బీఆర్‌ఎస్ దానికి వంత పాడడం చూస్తుంటే ఆ రెండు పార్టీలు ఒక్కటేనని స్పష్టమవుతోందని చామల అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • congress
  • MP Chamala Kiran Kumar Reddy
  • telangana
  • telugu news

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Prashant Kishor To Contest

    Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

Latest News

  • Gurugram Encounter: గురుగ్రామ్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్

  • Pawan Kalyan: నేడు ముంబై కి పవన్ కల్యాణ్.. భుజానికి సర్జరీ

  • Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

  • Donald Trump: నన్ను హత్య చేయాలని చూస్తోంది.. ట్రంప్‌ షాకింగ్ కామెంట్స్

  • Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd