Bittiri Sati : భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు..బిత్తిరి సత్తి క్షమాపణలు
నేను కూడా భగవద్గీతను ఆరాధిస్తా, చదువుతాను. ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నా..
- By Latha Suma Published Date - 03:11 PM, Thu - 8 August 24

Bittiri Sati: భగవద్గీత (Bhagavad Gita)ను కించపరిచేలా వీడియో చేశాడన్న ఘటనపై బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ కావలి వివాదంలో ఇరుకున్న విషయం తెలిసిందే. బిల్లు గీత అంటూ బిత్తిరి సత్తి పేరడీగా మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశారంటూ బిత్తిరి సత్తిపై తెలంగాణ ‘వానర సేన’ సభ్యులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు బిత్తిరి సత్తికి ఫోన్ చేసి హిందూ సమాజాన్ని అవమానించేలా వీడియో చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఘటనపై సారీ చెప్పిన బిత్తిరి సత్తి
తాను సరదాగా చేసిన వీడియోని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఎవరినీ కించపరచాలని చేయలేదు. ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నా అంటూ వీడియో ద్వారా తెలిపిన బిత్తిరి సత్తి. https://t.co/cWqRtGXTme pic.twitter.com/jIFRGbxhu7
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2024
అయితే తాజాగా ఈ అంశంపై బిత్తిరి సత్తి స్పందించారు. భగవద్గీతపై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘నేను మీ బిత్తిరి సత్తి. ఈ మధ్య ఓ వీడియో వైరల్ అయింది. నేను ఎప్ప్పటి లాగానే సరదాగా వీడియో చేశాను. అందులో చిన్న అక్షరదోషం జరిగింది. కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను కూడా భగవద్గీతను ఆరాధిస్తా, చదువుతాను. ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నా. ఇన్ని ఏళ్లలో ఏం తప్పు జరగలేదు. ఎందుకు ఇలా చేశారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎప్పుడూ మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి వీడియోస్ తీస్తుంటాను. ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చారు.