Bithiri Sathi Joins BRS : బిఆర్ఎస్ లో చేరగానే కేసీఆర్ ను మెగా హీరోతో పోల్చిన బిత్తిరి సత్తి
ఈనాడు తెలంగాణ ఎంత పచ్చగా ఉందొ చూస్తున్నాం..ఇంత పచ్చగా చేసిన కేసీఆర్ ను మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు
- By Sudheer Published Date - 09:10 PM, Fri - 27 October 23

అంత భావించినట్లే ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి (Bithiri Sathi ) (అలియాస్ చేవెళ్ల రవికుమార్) బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ ఎన్నికల (2023 Telangana Elections) సమయం దగ్గర పడుతుండడం తో బిఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) పార్టీలలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఓ పక్క పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతుండగా..అదే స్థాయిలో అధికార పార్టీ లోకి చేరుతున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ శ్రేణులు చేరగా..తాజాగా ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి (Bithiri Sathi ) (అలియాస్ చేవెళ్ల రవికుమార్) సైతం బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్ రావు (Harish Rao) సమక్షంలో టీ పీసీసీ మాజీ సెక్రటరీ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పోరేటర్ సింగిరెడ్డి శిరీష, రవి కుమార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి) తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికి మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు అని విమర్శించారు. రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉండాలా, బలహీనమైన నాయకత్వం ఉండాలా అని ప్రశ్నించారు. ఇటువైపు బలమైన కేసీఆర్ ఉన్నడు, అవతలి వైపు ఎవరు ఉన్నారని నిలదీశారు.
ఇక బిత్తిరి సత్తి మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ ఫై ప్రశంసల జల్లు కురిపించారు. ఈనాడు తెలంగాణ ఎంత పచ్చగా ఉందొ చూస్తున్నాం..ఇంత పచ్చగా చేసిన కేసీఆర్ ను మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు తాగేందుకు నీరు లేక..ఎక్కడ చూసిన నీరు కోసం బిందెలు పట్టుకొని పరుగులు తీసేవాళ్ళం..కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా కేసీఆర్ గారు మిషన్ భగీరథ ను తీసుకొచ్చి నీటి సమస్య లేకుండా చేసారు. ఎన్నో ప్రాజెక్ట్ లు , ఎన్నో సంక్షేమ పధకాలు తీసుకొచ్చి ఈనాడు తెలంగాణ ను నెం 1 గా చేర్చారని అలాంటి మెగా హీరో కేసీఆర్ గారు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
Read Also : T Congress 2nd List : తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల..