Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్.. అధిక ప్రాధాన్యత వీరికే!
రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో కలెక్టర్లతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ ఉండనుంది.
- By Gopichand Published Date - 06:27 PM, Thu - 9 January 25

Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) పథకం తుది దశకు చేరింది. ఇప్పటికీ 95 శాతం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక హైదరాబాద్‌లోనే 88 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తి అయింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను (indirammaindlu.telangana.gov.in) ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యల వివరాలు ఫిర్యాదుదారుని మొబైల్ కు మెసేజ్ రూపంలో అందుతుంది. వీలైనంత త్వరితగతిన ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు సీఎం రేవంత్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి అవకాశం ఇవ్వనున్నారు. వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాధలు, వితంతువులు, ట్రాన్స్ జెండర్లు, సఫాయి కర్మచారులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Kuber Vastu: ఈ దిక్కులో కుబేరుడిని ఉంచితే డబ్బే డబ్బు!
ఇందిరమ్మ ఇళ్లతోపాటు పలు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి జనవరి 26వ తేదీన ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగటానికి వీల్లేదని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వం అందించే పథకాలు అందుతాయని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉందని, ఎక్కడా ఎలాంటి మచ్చలేకుండా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అధికారులు తప్పులు చేసినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. త్వరలోనే అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇళ్లు వస్తుందని అన్నారు.
సీఎం రేవంత్ కాన్ఫరెన్స్
రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో కలెక్టర్లతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ ఉండనుంది. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ దిశా నిర్దేశం చేయనున్నారు.