Bandi Sanjay : భైంసా నుంచి బండి సంజయ్ ఐదవ దశ ప్రజాసంగ్రామ యాత్ర…ఎప్పటినుంచి అంటే..!!
- By hashtagu Published Date - 11:36 AM, Sun - 20 November 22

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజాసంగ్రామానికి సిద్దం అవుతున్నారు. నవంబర్ చివరి వారం నుంచి బైంసా నుంచి యాత్రను ప్రారంభిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు. నవంబర్ 28న బాసర నుంచి ప్రారంభమై భైంసా మీదుగా కరీంనగర్ చేరుకుంటుందని తెలుస్తోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి ఈ యాత్ర ప్రవేశించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాగా ఈ పాదయాత్రలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీకిలోకి చేరుతున్నట్లు సమాచారం. బైంసాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో రెండు రోజుల క్రితం కాంగ్రెస్ కు గుడ్ పై చెప్పిన రామరావు పటేల్ బీజేపీలో చేరుతారని బీజేపీ తెలిపింది. 16రోజుల పాటు సాగే ఈ ప్రజాసంగ్రామా యాత్ర నిర్మల్, ఖానాపూర్, బాదన్ కుర్తి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్ రూరల్ తోపాటుగా కరీంనగర్ ఈ యాత్ర సాగుతుందని నాయకులు తెలిపారు.