Beer Sales: జోరు పెంచిన బీరు.. నెల రోజుల్లో 7.44 కోట్ల బీర్లు తాగేశారు..!
ఈ వేసవికాలంలో ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రతతో బీర్ల విక్రయాలు (Beer Sales) కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి.
- Author : Gopichand
Date : 01-06-2023 - 11:32 IST
Published By : Hashtagu Telugu Desk
Beer Sales: ఈ వేసవికాలంలో ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రతతో బీర్ల విక్రయాలు (Beer Sales) కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మందు బాబులు శరీరంలోని వేడిని తగ్గించుకునేందుకు చిల్ బీర్లు తాగుతున్నారు. దీంతో తెలంగాణలో ఈ నెలలో బీర్ల విక్రయాలు రికార్డు స్థాయిలో పెరిగాయి.
అయితే ఈ ఎండల్లో బీర్ల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు అన్ని ప్రాంతాల్లో అమాంతంగా బీర్ల అమ్మకాలు పెరగడమే ఇందుకు కారణం. ఈ వేసవిలో మద్యం ప్రియులు మాత్రం చల్లటి బీర్లు తాగేందుకు మొగ్గుచూపుతున్నారు. వేసే సీజన్లలో లిక్కర్ తాగే వాళ్లు ఎండల నేపథ్యంలో మాత్రం బీర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువమంది బీర్లు తాగేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో అమ్మకాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది.
Also Read: Condoms to Funerals: అంత్యక్రియలకూ కండోమ్ తీసుకెళ్తున్నారట.. ఎందుకంటే?
నెల రోజుల్లో 7.44 కోట్ల బీర్లు లాగించేశారు
బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. వేసవిలో చల్లని బీర్లనే ఎక్కువగా తాగుతున్నారు. ఈ వేసవిలో బీర్ల అమ్మకాలు జోరుగా పెరిగాయి. మే నెలలో రికార్డు స్థాయిలో 7.44 కోట్ల బీరు సీసాలు అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. వేసవికి తోడు మ్యారేజ్‌లు ఉండటంతో ఎండవేడిమికి తట్టుకోలేక జనం బీర్లను ఆశ్రయించారు. 2019 మే నెలలో 7.2కోట్ల బీరు సీసాలు అమ్ముడుకాగా.. ఈ ఏడాది మే నెలలో ఆ రికార్డు బద్దలైంది. దీంతో ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది.