Condoms to Funerals: అంత్యక్రియలకూ కండోమ్ తీసుకెళ్తున్నారట.. ఎందుకంటే?
అమెరికాలో ప్రతి 8 మంది పురుషులలో ఒకరు అంత్యక్రియలకు వెళ్ళేటప్పుడు కూడా కండోమ్ (Condoms) తీసుకెళ్తున్నారట!!
- By pasha Published Date - 10:45 AM, Thu - 1 June 23

కండోమ్ (Condoms).. దీన్ని ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు.. హోటల్ కు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు.. లాడ్జికి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు.. కానీ అమెరికాలో ప్రతి 8 మంది పురుషులలో ఒకరు అంత్యక్రియలకు వెళ్ళేటప్పుడు కూడా కండోమ్ తీసుకెళ్తున్నారట!! ఔను.. 18 నుంచి 35 ఏళ్లలోపు వయసున్న 2,000 మందిని సర్వే చేయగా ఈవిషయం వెల్లడైందని కండోమ్ కంపెనీ ట్రోజన్ వెల్లడించింది. ఇంతకీ అంత్యక్రియలకు వెళ్ళేటప్పుడు కండోమ్ ను తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారా ? సర్వేలో పాల్గొన్న వాళ్ళే దీనికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. అదేంటో చూడండి..”
ఎవరైనా చనిపోతే తీవ్ర దుఃఖం కలుగుతుంది. ఎమోషనల్ పెయిన్ ఉంటుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో మనసులో బాధ తప్ప ఇంకేం ఉండదు. ఇలాంటి టైంలోనూ బాధను సంతోషంగా మార్చే ‘హ్యాపీ హార్మోన్’ (ఎండార్ఫిన్) రిలీజ్ అయ్యేలా చేసే సామర్ధ్యం సెక్స్ కు మాత్రమే ఉంటుందని మేం నమ్ముతాం. అందుకే మేం అంత్యక్రియలకు వెళ్ళేటప్పుడే కండోమ్ (Condoms) ను జేబులో వేసుకొని వెళ్తాం” అని సర్వేలో పాల్గొన్న చాలామంది అమెరికా యూత్ చెప్పారు. సర్వేలో పాల్గొన్న ప్రతి 8 మందిలో ఒకరు ఇదే ఆన్సర్ ఇవ్వడం గమనార్హం.
సర్వేలో వెల్లడైన విషయాలు ఇవీ:
- 65 శాతం మంది తమ తొలి డేటింగ్ సందర్భంగా కండోమ్‌లను తీసుకెళ్లారు.
- లైంగిక రక్షణ విషయంలో మగ, ఆడ ఇద్దరూ సమానంగా బాధ్యత వహించాలని సర్వేలో పాల్గొన్న 77 శాతం మంది అభిప్రాయ పడ్డారు.
- దాదాపు 78 శాతం మంది యువకులు తమ భాగస్వామికి గర్భ నిరోధక మాత్రలను ఇవ్వడం కంటే తాము కండోమ్స్ ను ధరించడమే మేలని అంటున్నారు.
- 52 శాతం మంది పురుషులు తమ కండోమ్‌లను నిల్వ చేయడానికి ఇష్టమైన ప్రదేశం వారి వ్యాలెట్.
- సురక్షితమైన, బాధ్యతా యుతమైన లైంగిక ప్రవర్తనను ప్రోత్సహించడానికి వ్యక్తులు కండోమ్‌లను సులభంగా యాక్సెస్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తారని ఈ సర్వేలో తేలింది.
Also Read: Viral Stunt: ఫేమస్ అవడం కోసం కుక్కతో అలాంటి స్టంట్.. చివరికి?
Related News

Lightning Strike: యెమెన్‌లో విషాదం.. పిడుగుపాటుకు ఏడుగురు మృతి
పిడుగులు పడి ఏడుగురు చనిపోయిన ఘటన యెమెన్‌లో చోటు చేసుకుంది. యెమెన్‌లోని వాయువ్య ప్రావిన్స్‌లోని హొడైదాలో గత 24 గంటల్లో పిడుగుపాటుకు ఏడుగురు మరణించారు