HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Beer Prices Hike In Telangana

Beer Prices Hike : తెలంగాణ మందుబాబులకు షాక్ ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం

Beer Prices Hike : బీర్ల ధరలను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

  • Author : Sudheer Date : 11-02-2025 - 7:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Beer Price Hike Tg
Beer Price Hike Tg

తెలంగాణలో మద్యం ప్రియులకు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎండాకాలం ఇంకాపూర్తిగా రానేలేదు..అప్పుడే బీర్ల ధరలను 15 శాతం (Beer Prices Hike) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఈరోజు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. పెరిగిన ధరలతో మద్యం వినియోగదారుల పై భారం పడనుంది. బీర్ల సరఫరా సంస్థ యునైటెడ్ బేవరేజెస్ కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను నిలిపివేయడం, తాము నష్టాల్లో ఉన్నామని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ అంశంపై విచారణ చేపట్టి, రిటైర్డ్ జడ్జీ జైస్వాల్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బీర్ల సరఫరాదారులకు 15 శాతం ధర పెంపు సిఫారసు చేసింది. సిఫారసు మేరకు తెలంగాణ ప్రభుత్వం బీర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో వినియోగదారులకు మరింత ఖర్చు పెరగనుండగా, మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగే అవకాశముంది. ఈ నిర్ణయంపై మద్యం వ్యాపారులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.

Adani Group : 1000 పడకలతో అదానీ 2 హాస్పిటల్స్ ..ఎక్కడంటే..!!

ఇక మద్యం ధరల పెంపు నిర్ణయం పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలులోకి రావడం గమనార్హం. ఏపీలో కూడా లిక్కర్ ధరలను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ మద్యం ప్రేమికులకు తీవ్ర నిరాశ కలిగించిన నిర్ణయంగా మారింది. మరి బీర్ల ధరల పెంపు నేపథ్యంలో మద్యం వినియోగదారులు ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయం వల్ల నష్టాల్లో ఉన్న సరఫరాదారులు లాభపడతారని, అలాగే ప్రభుత్వానికి ఆదాయ వృద్ధి చెందుతుందని చెబుతోంది. బీర్ల ధరల పెంపుతో మద్యం మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Beer Prices Hike
  • CM Revanth Reddy
  • telangana

Related News

Notification for the recruitment of Anganwadi teacher posts!

Anganwadi Jobs: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

తెలంగాణలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో అధికారిక నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా.. జోగులాంబ గద్వాల జిల్లాలోని నిరుద్

  • Huge good news from the Revanth government for Telangana employees.

    CM Revanth Reddy: తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్

  • Good news for farmers... Rythu Bharosa funds to be released today.

    Rythu Bharosa: అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల

  • Huge good news from the Revanth government for Telangana employees.

    Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

Latest News

  • Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

  • Sudha Kongara: రెమ్యునరేషన్ వివాదం పై కోర్టుకు వెళ్లిన ‘పరాశక్తి’ డైరెక్టర్ సుధా కొంగర

  • Allari Naresh: అల్లరి నరేష్ పుట్టినరోజు కానుకగా ‘రంభ ఊర్వశి మేనక’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

  • Raghava Lawrence: పొలిటికల్ ఎంట్రీపై ఊహించని ట్విస్ట్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం

  • AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd