HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Be Alert Some Trying Cheap Politics In Name Of Religion Kcr

CM KCR: కులమతాల పేరుతో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కేసీఆర్

కొందరు కావాలనే మతం, కులం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని...వారితో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా బీజేపీని విమర్శించారు.

  • Author : Hashtag U Date : 27-04-2022 - 7:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr
Kcr

కొందరు కావాలనే మతం, కులం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని…వారితో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా బీజేపీని విమర్శించారు. మతతత్వం అనేది క్యాన్సర్ జబ్బులాంటిది. ఒకసారి వస్తే…చాలా ప్రమాదకరం. మన దగ్గర దాన్ని తెచ్చుకోవద్దని సీఎం కేసీఆర్ హితవుపలికారు. హైదరాబాద్ లో మంగళవారం మూడు టిమ్స్ ఆసుపత్రుల శంకుస్థాపన నేపథ్యంలో అల్వాల్ లో జరిగిన సభలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని మతాలు, కులాలను ఆదరించే దేశం మనది..కొందరు మాత్రం కులం, మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. అన్నికులాలు, మతాలను ఆదరించే పరిస్థితిని చెడగొడితే ఎటూకాకుండా పోతామన్నారు.

తెలంగాణలో వైద్య విధానాన్ని పటిష్టపరిచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, పేదరికం కారణంగా ప్రజలు వైద్యానికి దూరం కావద్దని అన్నారు. హైదరాబాద్ హెచ్ఎండీఏ పరిధిలో 1.64కోట్ల జనాభా ఉందని గాంధీ, ఉస్మానియా కాకుండా మరో నాలుగు భారీ మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్త నిర్మించబోయే మూడు టిమ్స్ ఆసుపత్రుల్లో పేదలకు ఫ్రీగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందన్నారు. 16 స్పెషాలిటీ,15 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని సీఎం అన్నారు.

కులమతాల పేరుతో రాజకీయాలు చేసే వారిని ప్రజలు గమనించాలని తెలిపారు. మనదేశానికి చెందిన సుమారు 13కోట్ల మంది విదేశాల్లో ఉన్నారని…అక్కడి ప్రభుత్వాలు వాళ్లని వెనక్కి పంపిస్తే..వారికి ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలని ప్రశ్నించారు. ఈ 7ఏండ్లలో హైదరాబాద్ లో 2.30లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని…10నుంచి 15లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని గుర్తు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • k chandrasekhar rao
  • telangana politics

Related News

Kavitha warns the Congress government.

Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ (JVR OC) గని వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన సింగరేణి ‘బాయిబాట’ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఈ హైడ్రామా చోటుచేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా కవితను గని లోపలికి అనుమతించలేమంటూ సింగరేణి అధికారులు, పోలీసులు ఆమెను గేటు వద్దే అడ్డుకున్న

  • CM Revanth Reddy issues a strong warning to KTR.

    Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Latest News

  • Nara Brahmani: నారా బ్రాహ్మణికి ‘ఫార్చ్యూన్‌ ఇండియా’ జాబితాలో చోటు.. నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్

  • Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో చిరుత హల్ చల్

  • US-Iran War: అమెరికా,ఇరాన్ చర్చలు.. కానీ సీజ్‌ఫైర్ మాత్రం క్లోజ్

  • Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగుల‌కు తీపి కబురు

  • Pullela Gopichand: గోపీచంద్ అకాడమీతో చుప్స్ ఫుట్‌వేర్ భాగస్వామ్యం

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd