HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bandi Sanjay Should Tie Up Kcr And Show The Movie Balagam

Bandi Sanjay : కేసీఆర్ ను కట్టేసి ‘బలగం’ సినిమా చూపించాలి : బండి సంజయ్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను మేళవించి తెరకెక్కిన సినిమా బలగం. అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమాగా ప్రేక్షకుల మన్నలను పొందుతుంది.

  • Author : Hashtag U Date : 10-04-2023 - 7:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandi Sanjay Should Tie Up Kcr And Show The Movie 'balagam'
Bandi Sanjay Should Tie Up Kcr And Show The Movie 'balagam'

Bandi Sanjay : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను మేళవించి తెరకెక్కిన సినిమా బలగం. అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమాగా ప్రేక్షకుల మన్నలను పొందుతుంది. అయితే నేడు సోమవారం బలగం సినిమాను వీక్షించారు తెలంగాణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay). హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి ధియేటర్ లో బలగం సినిమా చూశారు.బండి సంజయ్ తోపాటు చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్లు 200 మంది, మరియు ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధియేటర్ లో సినిమా చూశారు.

సినిమా చూసిన అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. బలగం సినిమాలో కుటుంబ గొప్పదనం గురించి బాగా చూపించారని అన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగాలను సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారని దర్శకుడిని కొనియాడారు. కుటుంబ గొప్పతనం, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉండే ఎమోషన్స్ వంటివేమీ కేసీఆర్ కు తెలియవని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆయన బిడ్డ పెళ్లి సమయంలో జైలుకు పంపారని, తననూ తన అత్త చనిపోయిన సమయంలో జైలుకు పంపారని కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కుటుంబం అంటే ఏమాత్రం గౌరవం లేని కేసీఆర్ ను కట్టేసి ‘బలగం’ సినిమా చూపించాలని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు

తెలంగాణ పల్లె వాతావరణం ఆధారంగా తెరకెక్కిన బలగం సినిమా చూసి ప్రతి ఒక్కరు కంటతడిపెడుతున్నారు. విడిపోయిన ఎన్నో బంధాలు మళ్ళీ కలుసుకున్నాయి. సినిమాలో చూపించిన విధంగా కుటుంబాల మధ్య ప్రేమలు, అనురాగాలు కరువయ్యాయి. ఎవరికి వారే అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. కానీ బలగం సినిమా అందర్నీ ఆలోచింపజేసింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఓటిటిలోను స్ట్రీమింగ్ అవుతుంది. తెలంగాణలోని పల్లెల్లో ఈ సినిమాను తెర మీద ప్రదర్శిస్తున్నారు. ఊర్లో వాళ్ళు సినిమా చూసి కన్నీరుపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలో బంధాలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా చూసిన ప్రతిఒక్కరు భావోద్వేగానికి గురవుతున్నారు.

బలగం సినిమాలో ప్రియదర్శి, చైల్డ్ ఆర్టిస్ట్ వల్లంకిపిట్ట ఫేమ్ కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలను పోషించారు.. ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ సహా ఎంతో మంది అద్భుతమైన నటనతో అలరించారు.

Also Read:  Amarnath Reaction: తెలంగాణ బిడ్ దాఖలు పై మంత్రి అమర్నాథ్ రియాక్షన్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • balagam
  • Bandi Sanjay
  • bjp
  • brs
  • cinema
  • Hyderanad
  • india
  • kcr
  • movie
  • politics
  • telangana
  • tollywood

Related News

bjp Mp Godam Nagesh

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

Bjp Mp Godam Nagesh  ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్ల

  • Cigarette Price Hike

    ధూమపాన ప్రియులకు షాక్..

  • Vijay- Rashmika Wedding

    విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • Vijay Mallya

    Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

  • Rajamoli Korika

    Rajamouli : రాజమౌళి కోరిక అదేనట !!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd