HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Telangana News
  • ⁄Bandi Sanjay Hard Comments On Minister Ktr

Bandi Sanjay on KTR: కేటీఆర్ కు బండి సంజయ్ ‘ఓపెన్ ఛాలెంజ్’

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి కేటీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు.

  • By Balu J Updated On - 05:16 PM, Tue - 6 December 22
Bandi Sanjay on KTR: కేటీఆర్ కు బండి సంజయ్ ‘ఓపెన్ ఛాలెంజ్’

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఐదో విడుతలో భాగంగా నిర్మల్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చేపట్టిన యాత్రకు బీజేపీ శ్రేణుల నుంచి, ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తన యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మరోసారి ముఖ్యమంత్రి కుమారుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘కేసీఆర్ కొడుకు (KTR) ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ వాడతారు, అతని రక్త, వెంట్రుక నమూనాలిస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను తంబాకు తింటానని పచ్చి అబద్దాలు చెప్పినవ్ కదా… నాకు ఆ అలవాటే లేదని నిరూపిస్తా. అందుకోసం రక్త నమూనాలతో సహా నా శరీరంలోని ఏ భాగమైన పరీక్షలకు ఇచ్చేస్తా…. మరి నీకు రక్తం, వెంట్రుకల నమూనాలిచ్చే దమ్ముందా? ట్విట్టర్ టిల్లు బండారం బయటపడుతుందనే భయంతోనే బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను మూసివేయించారు. తక్షణమే ఆ కేసులు రీ ఓపెన్ చేసి విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలను కోరుతున్నాను’’ అని బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు.

‘‘అంబేద్కర్ జయంతి సందర్భంగా కనీసం వారం రోజుల పాటైనా ఉత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అంబేద్కర్ వర్ధంతి, జయంతిలకు TRS పార్టీ ఒక గంట సమయం కూడా కేటాయించదు. అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. వారం రోజులపాటు తెలంగాణలోని ప్రతీ బస్తీలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను బిజెపి ప్రభుత్వం వచ్చాక నిర్వహిస్తాం. అంబేద్కర్ చరిత్రను తెలియజేయాల్సిన అవసరం మనపై ఉంది. నేను ఈరోజు ఎంపీ ని అయ్యాను అంటే… అది అంబేద్కర్ పెట్టిన భిక్షనే. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ దేశాన్ని ప్రధాని మోదీ జీ పాలిస్తున్నారు. తను ప్రధాని అయ్యాకే పేదోళ్లకు ఈ దేశంలో న్యాయం జరుగుతోన్నది. రామ్నాథ్ కోవింద్ గారిని భారత రాష్ట్రపతి ని చేసిన ఘనత బీజేపీ పార్టీది’’ అని బండి సంజయ్ అన్నారు.

‘‘పార్లమెంటులో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన పార్టీ బిజెపిది. అంబేద్కర్ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకే… ‘పంచ తీర్థాల’ పేరుతో అభివృద్ధి చేస్తున్నాం. 12 మంది ఎస్సీ ఎంపీలను, కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత, ఎంతోమంది ఎస్సి లను గవర్నర్లు, ముఖ్యమంత్రులుగా చేసిన ఘనత బిజెపి పార్టీది. ప్రతి సంవత్సరం 1,20,000 మంది దళిత యువకులను, పారిశ్రామిక వేత్తలుగా మార్చుతున్న ఘనత బిజెపిది. కేసీఆర్ దళితుడిని సీఎం చేశాడా? దళితులకు మూడెకరాల పంపిణీ హామీ ఏమైంది? కెసిఆర్ దృష్టిలో.. దళితుడికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి లకు కేసిఆర్ ఎందుకు బయటకు రాడు? కెసిఆర్ తప్ప, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు వెళతారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే కేసీఆర్ మారుస్తానంటున్నాడు… కేసీఆర్ అంతా పోటుగాడా?’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.

‘‘తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తేవాలని చూస్తున్నాడు. ప్రశ్నించక పోవడంతోనే ముఖ్యమంత్రికి బలుపెక్కి, బరితెగించి ఈరోజు మనల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. నేటికీ తెలంగాణ దళిత బస్తీల్లో కనీస సౌకర్యాలు లేవు. G20 దేశాల్లో భారతదేశానికి అధ్యక్షత వహించే అవకాశం రావడం మనందరికీ గర్వకారణం. జి 20 సదస్సులో అందరి సూచనలను తీసుకునేందుకు, అన్ని పార్టీల అధ్యక్షులను మోదీ ఆహ్వానిస్తే… కేసీఆర్ ఎందుకు గైర్హాజరయ్యారు? జి 20 సన్నాహక సమావేశాని కంటే కేసీఆర్ కు ఇక్కడ పీకే పనేముందనీ ప్రశ్నిస్తున్నాను’’ బండి సంజయ్ (Bandi Sanjay) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Bangalore & Hyderabad drug cases were closed as it'll expose that #TwitterTillu is a drug addict. I'm ready to undergo any test to prove that I don't consume tobacco & will give any samples in any part of my body. Do u have guts to give blood & hair samples for drug test ? pic.twitter.com/BtMaTqdgVZ

— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 6, 2022

Aslo Read: Chandrababu Delhi Tour: ఢిల్లీలో బాబు బిజీ బిజీ.. నీతి అయోగ్ సీఈవోతో భేటీ!

Telegram Channel

Tags  

  • Bandi Sanjay
  • drugs case
  • It minister ktr
  • telangana

Related News

1 Killed : అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి

1 Killed : అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి

అమెరికాలో తెలంగాణ‌కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ తన వద్ద ఉన్న తుపాకీ పేలడంతో మృతి

  • KTR Acting CM: కేసీఆర్ స్కెచ్.. యాక్టింగ్ సీఎంగా కేటీఆర్!

    KTR Acting CM: కేసీఆర్ స్కెచ్.. యాక్టింగ్ సీఎంగా కేటీఆర్!

  • TSRTC : శ్రీశైలానికి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ప్రారంభించ‌నున్న టీఎస్ఆర్టీసీ

    TSRTC : శ్రీశైలానికి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ప్రారంభించ‌నున్న టీఎస్ఆర్టీసీ

  • Telangana Budget: రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టిన హరీష్ రావ్

    Telangana Budget: రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టిన హరీష్ రావ్

  • BJP Leader: సెల్ఫీ వీడియో తీసుకోని బీజేపీ నేత ఆత్మహత్య.. కారణమిదే..?

    BJP Leader: సెల్ఫీ వీడియో తీసుకోని బీజేపీ నేత ఆత్మహత్య.. కారణమిదే..?

Latest News

  • Hyderabad Old City: హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధిపై కేటీఆర్ రివ్యూ

  • Double Decker buses: డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయ్..!

  • Kiara Advani weds Sidharth Malhotra: ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ జంట.. పిక్స్ వైరల్!

  • UP: యూపీలో దారుణం, మృతదేహాన్ని 10కిమీ ఈడ్చుకెళ్ళిన కారు.

  • Shraddha Walker: శ్రద్ధ వాకర్ కేసులో విస్తుపోయే విషయాలు… 35 ముక్కలుగా నరికి, ఎముకలు గ్రైండర్!

Trending

    • Top 10 Robots: 2023లో ప్రపంచాన్ని మార్చే 10 రోబోలు

    • Balakrishna : నోరు జార‌లేదు..వ‌క్రీక‌రించారు! చింతిస్తున్నా..మీ బాల‌య్య‌.!

    • PAN Card: ఆధార్ తో మీ పాన్ లింక్ అయ్యిందా..? ఇలా తెలుసుకోవచ్చు

    • Oppo Reno 8T: ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో రెనో 8టీ

    • Modi@1: మన మోడీ వరల్డ్ నంబర్ 1

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: