Chandrababu Delhi Tour: ఢిల్లీలో బాబు బిజీ బిజీ.. నీతి అయోగ్ సీఈవోతో భేటీ!
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు.
- By Balu J Published Date - 03:31 PM, Tue - 6 December 22

ఢిల్లీ పర్యటన (Delhi Tour) లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) బిజీ బిజీగా ఉన్నారు. వివిధ రాష్ట్రాల నాయకులతో వరుసగా భేటీ అవుతూ పలు అంశాలపై చర్చిస్తున్నారు. తాజాగా మంగళవారం ఢిల్లీలో నీతి అయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పరమేశ్వరన్ అయ్యర్‌తో సమావేశమయ్యారు. డిజిటల్ పరిజ్ఞానంపై దృష్టి సారించేందుకు వ్యూహాన్ని రూపొందించడంతోపాటు దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేయడంపై ఇద్దరూ చర్చించుకున్నారు.
పరమేశ్వరన్ అయ్యర్ తన అనుభవాలను చంద్రబాబుతో పంచుకున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జీ-20 సన్నాహక సమావేశానికి హాజరైన చంద్రబాబు.. న్యూఢిల్లీలో కొందరు ఉన్నతాధికారులతో భేటీ అవుతున్నారు. పరమేశ్వరన్ అయ్యర్‌తో తన సమావేశంలో చంద్రబాబు (Chandrababu) ‘విజన్-2047’పై తన అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా డిజిటల్ పరిజ్ఞానంపై చంద్రబాబు, పరమేశ్వరన్‌లు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. యువత మరింత ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ప్రోత్సహించాలని చంద్రబాబు, పరమేశ్వరన్ భావించారు. చంద్రబాబు (Chandrababu) వెంట టీడీపీ నేత, ఎంపీ రామ్‌మోహన్‌నాయుడు, మాజీ ఎంపీ ఖంభంపాటి రామమోహనరావు ఉన్నారు.
Aslo Read : Modi Call to Sharmila: షర్మిల కు మోడీ ఫోన్.. ఢిల్లీకి పిలుపు!