Pocharam Srinivas Reddy: పోచారం ఇంటి ముందు బాల్క సుమన్ ధర్నా
పోచారంతో మాట్లాడేందుకు బాల్క సుమన్ ప్రయత్నించగా పోలీసులు అతనిని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాల్క సుమన్ మరియు అనుచరులను భద్రత సిబ్బంది చెరిపివేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది.
- By Praveen Aluthuru Published Date - 01:05 PM, Fri - 21 June 24

Pocharam Srinivas Reddy: తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆరెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఆయన పార్టీ మార్పుపై వస్తున్న వార్తల నేపథ్యంలో పోచారం ఇంటికి చేరుకున్నారు బీఆర్ఎస్ నేత బల్కా సుమన్. పోచారంతో మాట్లాడేందుకు బాల్క సుమన్ ప్రయత్నించగా పోలీసులు అతనిని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాల్క సుమన్ మరియు అనుచరులను భద్రత సిబ్బంది చెరిపివేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు బాల్క సుమన్ పోలీసులపై మండిపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి కాగ్రెస్ లో చేరిక ఖాయమైంది. పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అధికార పార్టీ అభ్యర్థనపై పోచారం సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మళ్లీ చివరగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. రైతుల శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నట్లు ఆయన చెప్పారు. కాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Also Read: Lakshmi Devi: లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే మీ పూజ గదిలో ఇవి ఉండాల్సిందే?