Babu Mohan: బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్..!
బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్ (Babu Mohan) పేరును కేసీఆర్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
- By Gopichand Published Date - 09:47 AM, Fri - 29 March 24

Babu Mohan: లోక్‌సభ ఎన్నికలకు ముందు వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె డాక్టర్ కావ్య నేడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉండలేనని కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలకు లేఖ రాసింది. దీంతో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పదవి కోసం అధిష్టానం సెర్చింగ్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే వరంగల్ ఎంపీ బరిలోకి బీఆర్ఎస్ కీలక వ్యక్తిని బరిలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్ (Babu Mohan) పేరును కేసీఆర్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలోనే వరంగల్ పార్లమెంట్ స్థానంపై బీజేపీ తరఫున పోటీ చేయాలని బాబు మోహన్ ప్రయత్నం చేశారు. అయితే బీజేపీ హైకమాండ్ సరైన సంకేతాలు ఇవ్వకపోవడంతో బాబు మోహన్ బీజేపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎంపీ బరిలో ఉండేందుకు బాబు మోహన్ కాంగ్రెస్, బీఆర్ఎస్ అధినేతలకు బాబు మోహన్ టచ్ లోకి వెళ్లారు. చివరికి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయాలని నిర్ణయించుకుని కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీలో చేరారు. అయితే గత రాత్రి వరంగల్‌లో జరిగిన కీలక పరిణామాలతో కేసీఆర్ బాబు మోహన్‌కు ఫోన్ చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబు మోహన్‌కు రెండు రోజుల్లో టికెట్ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: Kadiyam Srihari: నేడు కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి..!
ఇదిలా ఉండగా మరోవైపు బీఆర్ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల ముందు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు కేకే, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె డాక్టర్ కావ్య కూడా సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp : Click to Join