Buy Back Fraud : హైదరాబాద్‌లో వెలుగు చూసిన మరో భారీ మోసం.. బై బ్యాక్ పేరుతో రూ.500 కోట్లు లూటీ
పెట్టుబడి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హై రిటర్న్స్ పేరిట బై బ్యాక్ పాలసీ ద్వారా కొన్ని నెలల్లోనే డబ్బును రెట్టింపు చేసి తిరిగి ఇస్తామంటూ మోసగాళ్లు వసూళ్లకు పాల్పడ్డారు.
- By Kavya Krishna Published Date - 05:03 PM, Sat - 21 June 25

Buy Back Fraud : పెట్టుబడి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హై రిటర్న్స్ పేరిట బై బ్యాక్ పాలసీ ద్వారా కొన్ని నెలల్లోనే డబ్బును రెట్టింపు చేసి తిరిగి ఇస్తామంటూ మోసగాళ్లు వసూళ్లకు పాల్పడ్డారు. ఈ మోసాన్ని ‘ఏవీ ఇన్ఫ్రాకాన్’ అనే సంస్థ అమలు చేసినట్లు తెలుస్తోంది. బాధితులు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, సంస్థ ఛైర్మన్ విజయ్ గోగులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికల ముందు పింఛన్‌ల సీఎం నీతీశ్ కుమార్ పై కీలక నిర్ణయం
వివరాల్లోకి వెళితే, మాదాపూర్‌ను కేంద్రంగా చేసుకుని విజయ్ గోగుల బై బ్యాక్ పేరుతో పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించాడు. డబ్బు ఇస్తే 18 నెలలలో 50 శాతం లాభం లేదా ల్యాండ్ రిజిస్ట్రేషన్ హామీ ఇచ్చి నమ్మబలికాడు. నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరా వంటి ప్రాంతాల్లో తమ వెంచర్లు ఉన్నాయంటూ ప్రచారం చేసి పెట్టుబడులు రాబట్టాడు.
అయితే, 18 నెలల గడువు తర్వాత అసలు డబ్బు ఇవ్వకుండా మరో ప్రాజెక్ట్‌లో ఇస్తానంటూ కాలయాపన చేశాడు. బాధితులు గట్టిగా డిమాండ్ చేస్తే, బ్లాంక్ చెక్కులు ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దుర్గం చెరువు సమీపంలో ఈ మోసాన్ని కార్యాలయం ఆధారంగా నిర్వహించినట్టు తెలిసింది. ఇప్పటివరకు కనీసం 500 మందికి పైగా బాధితులున్నట్లు సమాచారం. మోసంలో మొత్తంగా సుమారుగా రూ. 500 కోట్ల వరకు నష్టపోయినట్లు అంచనా. ఇందులో ఒకరు అయిన వృద్ధుడు రాజు ఒక్కరే రూ. 84 లక్షలు పెట్టుబడి పెట్టినట్టు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు విజయ్ గోగుల పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Adluri Laxman : మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్