Gang Rape: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. మద్యం తాగించి వివాహితపై గ్యాంగ్ రేప్
రంగారెడ్డి జిల్లా పీరంచెరువు వద్ద దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ వివాహితను కిడ్నాప్ చేసి.. బలవంతంగా మద్యం త్రాగించి దుండగులు గ్యాంగ్ రేప్‌కు (Gang Rape) పాల్పడ్డారు. మహిళపై అత్యాచారం చేసిన అనంతరం తన వద్దనున్న బంగారు ఆభరణాలు దోచుకుని గండిపేట వద్ద వదిలివెళ్లారు.
- Author : Gopichand
Date : 19-02-2023 - 11:50 IST
Published By : Hashtagu Telugu Desk
రంగారెడ్డి జిల్లా పీరంచెరువు వద్ద దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ వివాహితను కిడ్నాప్ చేసి.. బలవంతంగా మద్యం త్రాగించి దుండగులు గ్యాంగ్ రేప్‌కు (Gang Rape) పాల్పడ్డారు. మహిళపై అత్యాచారం చేసిన అనంతరం తన వద్దనున్న బంగారు ఆభరణాలు దోచుకుని గండిపేట వద్ద వదిలివెళ్లారు. ఈ సంఘటనపై స్వయంగా ఆ వివాహిత తన భర్తకు చెప్పగా.. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: UP Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం.. పారిశ్రామికవేత్త మృతి
రెడ్ కలర్ కారులో పీరం చెరువు వద్ద వివాహితను దుండగులు కిడ్నాప్ చేశారు. కారులో వివాహితను కిస్మత్ పూర్ వైపునకు తీసుకెళ్లారు. చివరకు గండిపేట వద్ద నిందితులు ఆమెను వదిలేశారు. వివాహితకు మద్యం తాగించి నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు నుండి తేరుకున్న తర్వాత వివాహిత తన భర్తకు ఫోన్ చేసింది. ఈ ఘటనకు సంంబంధించి భర్తతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.