Kavitha Challenge: ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవచ్చు: కవిత సవాల్
అరెస్టు చేస్తారని బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు.
- By Balu J Published Date - 11:45 PM, Fri - 3 March 23

ఢిల్లీ (Delhi) లిక్కర్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్ట్ కావడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత అరెస్ట్ కాబోయేది కల్వకుంట్ల కవిత అని బీజేపీ నాయకులు జోస్యం చెప్పారు. అయితే ఈ విషయమై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తన పాత్ర ఉందని, తనను అరెస్టు చేస్తారని బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. నిజంగానే ఆ కేసులో తన పాత్రపై ఆధారులుంటే అరెస్టు చేయాలని కవిత (MLC Kavitha) సవాల్ విసిరారు.
బీజేపీ సర్కార్ పై కేసీఆర్ యుద్దం చేస్తున్నారు కాబట్టి ఆయనపై కక్ష తీర్చుకోవడానికి కేసీఆర్ కూతురునైన తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. దేశంలో తనకు చాలా మంది స్నేహితులున్నారని, వాళ్ళు చేసే వ్యాపారాలతో, వ్యవహారలతో తనకేం సంబంధం అని కవిత ప్రశ్నించారు. తాను వారితో కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బీజేపీ నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కవిత మండిపడ్డారు. సీబీఐ దర్యాప్తు పారదర్శకంగా ఉంటుందని తాను భావించడంలేదని, ఆ సంస్థ బీజేపీ చెప్పుచేతుల్లో నడుస్తోందని కవిత (MLC Kavitha) ఆరోపించారు.
Also Read: Errabelli: మంత్రి ఎర్రబెల్లి ఫోన్ మాయం

Related News

Power Strike: మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్న విద్యుత్ ఉద్యోగులు.. డెడ్ లైన్ ఫిక్స్!
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మరో మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్నారు.