HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Another Thousand Jobs In Telangana Ministers Key Announcement

Thousand Jobs In Telangana: తెలంగాణ‌లో మ‌రో వెయ్యి ఉద్యోగాలు.. మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌

పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్- రెసోజెట్ భాగస్వామ్య సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.

  • Author : Gopi Date : 25-11-2024 - 6:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thousand Jobs In Telangana
Thousand Jobs In Telangana

Thousand Jobs In Telangana: తెలంగాణ‌లో మ‌రో కంపెనీ పెట్టుబడుల‌కు సిద్ధ‌మైంది. పెట్టుబ‌డుల‌తో పాటు మ‌రో వెయ్యి మందికి ఉపాధి క‌ల‌గ‌నుంద‌ని (Thousand Jobs In Telangana) మంత్రి శ్రీధ‌ర్ బాబు తెలిపారు. ప‌లు దిగ్గ‌జ కంపెనీల‌కు ఎల‌క్ట్రానిక్ వినియ‌మ వ‌స్తువులు, విడి భాగాలు అందించే అంబ‌ర్‌-రెసోజెట్ భాగ‌స్వామ్య సంస్థ తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌కు ముందుకొచ్చ‌నట్లు మంత్రి తెలిపారు.

పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్- రెసోజెట్ భాగస్వామ్య సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సోమవారం నాడు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో సంస్థ ప్రతినిధులు తమ పెట్టుబడుల ప్రణాళికను వెల్లడించారు. అంబర్- రెసోజెట్ సంస్థకు ప్రభుత్వ పరంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ సంస్థ దేశంలోని పలు కంపెనీల కోసం రూమ్ ఏసీలు, అత్యాధునిక వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు, పారిశ్రామిక ఎయిర్ కండిషనర్ల లాంటి పలు పరికరాలకు ఉత్పత్తి చేసి అందిస్తోందని ఆయన తెలిపారు. వచ్చే మూడేళ్లలో రూ.250 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పుతుందని శ్రీధర్ బాబు చెప్పారు.

Also Read: Nana Patole : రాజీనామా పై నానా పటోలే క్లారిటీ..అవన్నీ పుకార్లే

దీని వల్ల ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. త్వరలోనే అత్యాధునిక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పిసిబి) ల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. వందేభారత్ రైళ్లు, మెట్రో రైళ్ల ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలతో పాటు, బస్సులు, డిఫెన్స్ వాహనాలు, పారిశ్రామిక అవసరాలకు ఎయిర్ కండిషనర్ల తయారీలో అంబర్ ఎంటర్ ప్రైజెస్ కు మంచి పేరుందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి యూనిట్లు ఉన్న అంబర్ తాజాగా హైదరాబాద్ ను గమ్యస్థానంగా ఎంచుకున్నందుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ డా. ఇ. విష్ణువర్ధన్ రెడ్డి, సిఇఓ మధుసూదన్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ డా. ఎస్ కె శర్మ, అంబర్, రెసోజెట్ ప్రతినిధులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • congress
  • hyderabad
  • Jobs In TG
  • Minister Sridhar Babu
  • telangana
  • TG Politics
  • Thousand Jobs In Telangana

Related News

KTR

ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “నిన్న రాత్రి, హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, నాగ్‌పూర్‌లకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులతో ఏకాంతంగా చర్చించే అవకాశం నాకు లభించింది. ఈ సంభాషణలో మౌలిక సదుపాయాలు, పరిపాలన, రాజకీయాలు, వ్యక్తిగత ప్రయాణాలపై చర్చ జరిగింది.” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్, పాత కథనాలనే పునరావృతం చేయడం, తప్పుడు ఘనతను

  • Zepto

    Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • MIssing Case

    Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd