HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Andaman Nicobar Port Blair Municipal Team Visiting Ghmc

Hyderabad: హైదరాబాద్ అభివృద్ధి కోసం అండమాన్ నికోబార్ బృందం

హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ బృందం

  • Author : Vamsi Chowdary Korata Date : 18-02-2024 - 11:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad
Hyderabad

Hyderabad: హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ బృందం శానిటేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్ అధ్యయనం చేసేందుకు శనివారం హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా వారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జీహెచ్‌ఎంసీలో అమలు చేస్తున్న కార్యక్రమాలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధ్యయన బృందంతో కమిషనర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపుదల, టౌన్ ప్లానింగ్, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడంపై దృష్టిసారించామన్నారు. ఈ సందర్భంగా పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ బృందానికి సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా నగరాభివృద్ధికి చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు.

సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఇంటింటికీ చెత్త సేకరణ, వేరుచేయడం, సీ అండ్ డీ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, వేస్ట్ రీసైక్లింగ్ మెటీరియల్, తడి చెత్తతో కంపోస్ట్ తయారు చేయడం తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. నగరంలో ప్రతి రోజు స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతుందని, ప్రతిరోజు 7500 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి జవహర్ నగర్ డంప్ యార్డుకు తరలిస్తున్నామని, దాంతో వర్మీకంపోస్టు తయారు చేస్తున్నామన్నారు. ప్యారా నగర్‌లో మరో డంప్‌యార్డును సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రెండు నిర్మాణ వ్యర్థాల ప్లాంట్లను ఏర్పాటు చేశామని, మరో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

నగరవ్యాప్తంగా ఉత్పత్తయ్యే సీఅండ్‌డీ వ్యర్థాలను నగరానికి నాలుగు వైపులా ఎప్పటికప్పుడు రీసైకిల్ చేసేలా ఏర్పాట్లు చేశామని వారికి వివరించారు. నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఫ్లైఓవర్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రతా పథకాల అమలుపై పైన వివరించారు. అన్నపూర్ణ పథకం, ఆధునిక వైకుంఠదామాలు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, ఇతర మౌలిక సదుపాయాలను వివరించారు.

జీహెచ్ ఎంసీలో అన్నపూర్ణ భోజన పథకం ద్వారా ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నామని, నగరంలోని 139 కేంద్రాల ద్వారా ప్రతిరోజు 30 వేల మందికి అన్నపూర్ణ భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. పేదల ఆరోగ్యానికి సంబంధించి జీహెచ్ ఎంసీ పరిధిలో 284 బస్తీ దవాఖానలు పనిచేస్తున్నాయని, ఆదాయ వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయ, వ్యయాల వివరాలను వారికి వివరించారు. టౌన్ ప్లానింగ్, కొత్త టీడీఆర్ విధానం, రోడ్డు వైండింగ్ కార్యక్రమం, హరితహారం, పట్టణ జీవవైవిధ్యం, పార్కుల అభివృద్ధి, ట్రీ పార్కులు, వర్టికల్ గార్డెన్‌లు, వైకుంఠధామాల నిర్మాణం, కాలనీ పార్కుల ఏర్పాటు, తెలంగాణలో హరితహారం కార్యక్రమం, హరితహారం పెంపుదలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఈఎన్సీ జియా ఉద్దీన్, సీఈ దేవానంద్, అదనపు కమిషనర్ సరోజ, డాక్టర్ సునంద, పోర్ట్ బ్లెయిర్ కౌన్సిల్ టీమ్ కో-ఆర్డినేటర్ కె. గణేషన్, వైస్ చైర్ పర్సన్ బి. పద్మనాభం, కౌన్సిలర్లు సోమేశ్వరరావు, వసంత, వై.జోగారావు, లక్ష్మీ గణేశన్, కరుణానిధి, రాజేష్ రాం , రాజేష్ పాల్ గోవింద్, సుదీప్ రాయ్ శర్మ, అబ్దుల్ ఇస్లాం,డి. రాధిక, వెట్రివేలు, ఎల్‌ఓలు సుజిత్ బాలన్, ధీరజ్ రామ్, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Ananya Nagalla: హాట్ అందాలతో రెచ్చిపోయిన అనన్య నాగళ్ల.. చూపులతోనే మత్తెక్కిస్తోందిగా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andaman Nicobar Port Blair
  • development
  • GHMC
  • hyderabad
  • municipal

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

    Latest News

    • Strait of Hormuz: మళ్లీ యుద్ధం తీవ్రరూపం.. పెరుగుతున్న ముడిచమురు

    • Kavya Maran wedding: కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి ఫిక్స్

    • Indian Army Recruitment: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

    • kavitha: ఎన్నికల సంఘానికి కల్వకుంట్ల కవిత కీలక లేఖ

    • CM Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd