HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ananthula Madan Mohan Defeated Kcr

KCR Journey: కేసీఆర్‌ను ఓడించిన ఒక్క మగాడు

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కేసీఆర్ అంటే తెలియని వారు ఉండరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2001లో టిఆర్ఎస్ ని ఏర్పాటుచేసిన కేసీఆర్ 2014లో రాష్ట్రాన్ని సాధించారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 05-10-2023 - 2:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr
Kcr

KCR Journey: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కేసీఆర్ అంటే తెలియని వారు ఉండరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2001లో టిఆర్ఎస్ ని ఏర్పాటుచేసిన కేసీఆర్ 2014లో రాష్ట్రాన్ని సాధించారు. 2014 నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఓటమెరుగని లీడర్ గా చెప్పుకునే కేసీఆర్ తన జీవితంలో ఒకే ఒక్క వ్యక్తి చేతిలో ఓడిపోయారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

కాంగ్రెస్ పార్టీ లీడర్ అనంతుల మదన్ మోహన్ చేతిలో సీఎం కేసీఆర్ ఓడిపోయారు. 1983 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున సిద్దిపేట నియోజకవర్గంలో అనంతుల మదన్ మోహన్ బరిలో దిగారు. నందమూరి తారకరామారావు అంటే సీనియర్ ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తరఫున కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో మదన్ మోహన్ చేతిలో కెసిఆర్ ఓడిపోయారు. మదన్ మోహన్ కు 28, 766 ఓట్లు రాగ, కేసీఆర్ కు 27, 899 ఓట్లు వచ్చాయి. కేవలం 887 ఓట్ల తేడాతో కేసీఆర్ ఓడిపోయారు. అయితే అప్పటికే మదన్ మోహన్ మూడుసార్లు సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటంతో కేసీఆర్ కు ఓటమి తప్పలేదు. నిజానికి ఆ ఏడాది జరిగిన ఎన్నికలతోనే కేసీఆర్ మొదటిసారి పోటీ చేశారు. ఆ ఓటమితో కేసీఆర్ నిరాశ పడలేదు. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోనంతగా ప్రభావం చూపిస్తూ సీఎం స్థాయికి ఎదిగారు. కేసీఆర్ ఇప్పటివరకు 13 సార్లు విజయం సాధించారు.తొలి ఎన్నికలలో ఓటమి రుచి చూపించిన అనంతుల మదన్ మోహన్‌ను కేసీఆర్ రెండు సార్లు ఓడించారు. 1989, 1994 అసెంబ్లీ ఎన్నికలలో అనంతుల మదన్ మోహన్ సిద్దిపేట నియోజకవర్గంలోనే కేసీఆర్ చేతిలో ఓటమి పాలయ్యారు.

నిజానికి అనంతుల మదన్ మోహన్‌ను కేసీఆర్‌ రాజకీయ గురువుగా చెప్తారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో మదన్ మోహన్ చురుకుగా పాల్గొనేవారు. కేసీఆర్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. తొలినాళ్లలో కాంగ్రెస్‌లో ఉన్న కాలంలో మదన్ మోహన్‌కు సన్నిహితంగా ఉండేవారు. అదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించడంతో కేసీఆర్ అందులో జాయిన్ అయ్యారు. మదన్ మోహన్ పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి, టంగుటూరి అంజయ్య, కోట్ల విజయభాస్కర రెడ్డిల మంత్రివర్గాలలో రెవెన్యూ, ఆరోగ్యం, విద్యా శాఖ వంటి కీలక శాఖలకు ఆయన మంత్రిగా కొనసాగారు. ఇక 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేసిన ఓడిన మదన్ మోహన్ ఆ తర్వాత ప్రభావం చూపించలేకపోయారు. కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2004లో ఆయన మరణించారు.

Also Read: Journalists protest : 16 మీడియా సంస్థ‌ల జ‌ర్న‌లిస్ట్ లు సుప్రీం చీఫ్ జ‌స్టిస్ కు లేఖ‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ananthula Madan Mohan
  • brs
  • congress
  • First Elections
  • kcr
  • tdp
  • telangana

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

  • Gold Rate: పసిడి ప్రేమికులకు పండగే.. కుప్పకూలిన బంగారం ధరలు

  • Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

  • Businessman Missing: స్విట్జర్లాండ్ విహారయాత్రలో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు.. రూ. 50 కోట్ల కుంభకోణంలో పోలీసుల దర్యాప్తు!

  • Home Loan Rates: ఇల్లు కొనాలనుకుంటున్నారా? జూలై నెలలో హోంలోన్లపై రుణ వడ్డీ రేట్లు ఎంత ఉందంటే?

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd