Amit Shah Telangana Tour: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా
బీహార్‌లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణా పర్యటన వాయిదా పడింది .ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాచారం ఇచ్చారు.
- Author : Praveen Aluthuru
Date : 27-01-2024 - 6:01 IST
Published By : Hashtagu Telugu Desk
Amit Shah Telangana Tour: బీహార్‌లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణా పర్యటన వాయిదా పడింది .ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాచారం ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపై సీరియస్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే రేపు బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణలో పర్యటించి ఒకే రోజు మూడు సభల్లో పాల్గొనాలని నిర్ణయించారు. షా తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అయి పార్లమెంట్ ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు అయితే కొన్ని అత్యవసర పనుల కారణంగా అమిత్ షా పర్యటన రద్దయింది. దీంతో అమిత్ షా పాల్గొనాల్సిన కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ సమావేశాలు వాయిదా పడ్డాయి. తదుపరి సమావేశ వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం అని బండి సంజయ్ తెలిపారు.
బీహార్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ, లాలూ యాదవ్ ఆధ్వర్యంలోని ఆర్జేడీ పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అమిత్ షా టూర్ వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.
Also Read: Rajamouli Mahesh : రెమ్యునరేషన్ లేకుండానే సినిమా.. రాజమౌళి సినిమాకు మహేష్ ప్లాన్ ఏంటి..?