Bandi Sanjay: ఇదంతా ఢిల్లీ స్క్రిప్ట్.. లిక్కర్ స్కాంను డైవర్ట్ చేసేందుకు డ్రామా..!!
- By hashtagu Published Date - 10:26 PM, Fri - 4 November 22

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మొయినాబాద్ ఫాంహౌజ్ ఘటన గురించి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫాంహౌజ్ కు సంబంధించిన స్క్రిప్ట్ అంతా కూడాఢిల్లీలోనే రెడీ అయ్యిందన్నారు. ఇదంతా లిక్కర్ స్కాం నుంచి బయటపడేందుకు ఆడిన డ్రామాగా ఆరోపించారు. ఢిల్లీకేసును డైవర్ట్ చేసేందుకు ఈ డ్రామా ఆడారంటూ ఆరోపించారు. ఆ ముగ్గురు నకిలీ గ్యాంగ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారన్నారు.
కాగా అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపైనే కేసీఆర్ కు నమ్మకం లేదని… రోహిత్ రెడ్డి నీతిమంతుడా అంటూ ప్రశ్నించారు. ఫాంహౌజ్ ఘటనలో పాల్గొన్న నలుగురు ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. గురువారం సీఎం ప్రెస్ మీట్లో వీడియోల ప్రదర్శన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. ఒక వేళ తమ పార్టీలోకి ఎమ్మెల్యేలను ఆహ్వానించినట్లయితే మా పార్టీ ఎమ్మెల్యేలు చర్చిస్తారు కానీ మధ్యలో ఆ స్వామిజీలను ఎందుకు మధ్యవర్తులుగా పెట్టుకోవల్సి ఉందన్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం మా పార్టీకి లేదన్నారు. బ్రోకర్లను పెట్టి ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేస్తాం. అలాంటి ఖర్మ మా పార్టీకి లేదన్నారు.