HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Big Shock For Trump In The Us Supreme Court

ట్రంప్‌కు యూఎస్ సుప్రీంకోర్టులో బిగ్ షాక్‌..

  • Author : Vamsi Chowdary Korata Date : 21-02-2026 - 9:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
US Supreme Court rules against Trump's global
US Supreme Court rules against Trump's global
US Supreme Court  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు ఆ దేశ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ ఏకపక్షంగా విధించిన భారీ సుంకాలను (టారిఫ్స్) అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ తీర్పుతో భారత ఎగుమతిదారులకు తక్షణమే భారీ ఊరట లభించినట్లయింది.

1977 నాటి అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (IEEPA) అడ్డం పెట్టుకుని సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది పూర్తిగా అమెరికా పార్లమెంట్ అయిన కాంగ్రెస్ పరిధిలోని అంశమని 6-3 మెజారిటీతో తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో ట్రంప్ ఏకపక్ష వాణిజ్య నిర్ణయాలకు అడ్డుకట్ట పడింది.

సుప్రీంకోర్టు తీర్పు భారత వాణిజ్య వర్గాలకు పెద్ద ఊరటనిచ్చింది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్ నుంచి వచ్చే వస్తువులపై 18 శాతం సుంకం విధించాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదన తాజా తీర్పుతో చెల్లకుండా పోయింది. అంతేకాకుండా, ఇప్పటివరకు అక్రమంగా వసూలు చేసిన పన్నులను తిరిగి పొందేందుకు భారత కంపెనీలకు అవకాశం లభించనుంది. ఫలితంగా అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తుల పోటీతత్వం పెరగనుంది.

అయితే, ఈ తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. దీనిని ‘సిగ్గుచేటు’గా అభివర్ణించిన ఆయన, మరో చట్టంలోని సెక్షన్ 122 కింద అన్ని దేశాలపై 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తానని ప్రకటించారు. అదే సమయంలో భారత్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో ఎలాంటి మార్పు ఉండదని, భారత్ టారిఫ్‌లు చెల్లించాల్సిందేనని ఆయన నొక్కిచెప్పడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుతానికి ఊరటనిచ్చినా, ట్రంప్ తాజా హెచ్చరికలతో వాణిజ్య రంగంలో కొంత అనిశ్చితి నెలకొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • Economic Policy
  • global tariff
  • IEEPA
  • Import Export
  • India exports
  • India tariffs
  • Trade agreement
  • Trade war
  • US Supreme Court

Related News

Donald Trump

Donald Trump: ఇరాన్ డీల్‌ విషయంలో ఒప్పందానికి తొందరేం లేదు: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి చర్చలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఒప్పందం దాదాపు పూర్తయిందని ఆదివారం ప్రకటించిన ఆయన, తాజాగా ఆ మాటకు భిన్నంగా మాట్లాడారు. ఒప్పందం ఇంకా చర్చల దశలోనే ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’లో ఓ పోస్ట్ చేశారు. “చర్చలు సక్రమంగానే సాగుతున్నాయి. కానీ ఒప్పందం విషయంలో తొందరపడబోము. చ

  • Iran Closes Airspace; US Warns of Attacks

    Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

  • Donald Trump

    Donald Trump: ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సిద్ధం..

  • The prices of essential commodities that are shaking America

    US Inflation: అమెరికాను వణికిస్తున్న నిత్యావసర ధరల

Latest News

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd