Alampur BRS MLA Vijayudu : మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్..?
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సైతం పార్టీని వీడడానికి సిద్ధం అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి
- By Sudheer Published Date - 01:42 PM, Mon - 8 July 24

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party బిఆర్ఎస్ (BRS) నేతలకు వేస్తున్న గాలానికి వరుసగా చిక్కుతున్నారు. వరుసపెట్టి ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అసలు బిఆర్ఎస్ లో నేతలంతా ఉంటారా..? అనే సందేహం అందరికి కలుగుతుంది. గడిచిన పదేళ్లు బిఆర్ఎస్ పార్టీ లో కీలక పదవులు అనుభవించి , కేసీఆర్ అత్యంత సన్నిహితులు అని గుర్తింపు తెచ్చుకున్న వారు సైతం కేసీఆర్ కు బై చెప్పి రేవంత్ హాయ్ అంటూ వస్తుండడం తో బిఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఆందోళన పెరిగిపోతుంది. ఇంకా బిఆర్ఎస్..బిఆర్ఎస్ అంటూ జెండా లు పట్టుకుంటే రాబోయే రోజుల్లో మన పరిస్థితి ఏంటి అని మాట్లాడుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బిఆర్ఎస్ పార్టీ గుర్తుతో ఓడిన వారే కాదు గెలిచినా నేతలు సైతం కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ ఆరుగురు ఎమ్మెల్యేలు , పలువురు ఎమ్మెల్సీ లు కాంగ్రెస్ లో చేరగా..మరికొంతమంది అతి త్వరలో సీఎం రేవంత్ సమక్షంలో చేరబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక బిఆర్ఎస్ కు మంచి పట్టు ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ లో కూడా ఇప్పుడు వరుసగా బిఆర్ఎస్ కు షాకులు తగులుతున్నాయి. ఇప్పటికేపలువురు నేతలు బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరగా.. ఇప్పుడు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సైతం పార్టీని వీడడానికి సిద్ధం అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటీకే సీఎం రేవంత్ వీరు సంప్రదింపులు జరిపినట్లు అంటున్నారు. చూద్దాం మరి వీరు చేరతారా లేదా అనేది.
Read Also : Raasi : ఆ డైరెక్టర్ వల్లే నా జీవితం నాశనమైంది – నటి రాశి