Air India express : తెలుగు రాష్ట్రాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గుడ్‌న్యూస్
ఇక ఈ సర్వీసుల పెంపు వల్ల ఈ ప్రాంతాల వారికి సౌకర్యవంతంగా ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్డ్ తెలిపారు.
- Author : Latha Suma
Date : 16-11-2024 - 7:36 IST
Published By : Hashtagu Telugu Desk
flight services Increase: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుండి తన విమాన సర్వీసులను గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ నగరాల నుండి వారానికి 13 విమాన సర్వీసులు నడుస్తుండగా. వాటిని 250కి అంటే 45 శాతం అధికంగా పెంచుతున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. ఇక ఈ సర్వీసుల పెంపు వల్ల ఈ ప్రాంతాల వారికి సౌకర్యవంతంగా ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్డ్ తెలిపారు.
అంతేకాక..విశాఖపట్నం, విజయవాడ, గ్వాలియర్ నుంచి హైదరాబాద్ నేరుగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని, హైదరాబాద్ నుంచి బెంగళూరు, కొచ్చికి సర్వీసులు పెరగనున్నట్లు ఈ మేరకు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రతివారం 200 సర్వీసులతో తమ నెట్‌వర్క్‌లో హైదరాబాద్ మూడో అతిపెద్ద కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి నేరుగా 17దేశీయ విమానాశ్రయాలకు, సౌదీ అరేబియాలోని మూడు ప్రధాన ఎయిర్ పోర్టులకు సర్వీసులు నిర్వహిస్తున్నట్లు గార్డ్ తెలిపారు.
కలంకరి -ప్రేరేపిత లివరీని కలిగి ఉన్న మా కొత్త విమానం.. తెలుగు మాట్లాడే ప్రాంత గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడానికి మా అంకితభావాన్ని నొక్కి చెబుతుందని ఆయన తెలిపారు. ఇక ఈ శీతాకా సీజన్ సందర్భంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 400 రోజువారీ విమాన సర్వీసులు నిర్వించనున్నట్లు పేర్కొంది. గత ఏడాది ఇదే సీజన్‌లో 325 రోజువారీ సర్వీసులు నిర్వహించడం గమనార్హం.