AI Tea Stall: కరీంనగర్ లో AI టీ స్టాల్, ఓనర్ లేకుండానే టీ తాగొచ్చు ఇక!
టెక్నాలజీ పరిచయం ఉన్న ప్రతిఒక్కరికి ఏఐ సుపరిచితం. ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
- By Balu J Published Date - 01:33 PM, Wed - 13 September 23

AI Tea Stall: టెక్నాలజీ పరిచయం ఉన్న ప్రతిఒక్కరికి ఏఐ సుపరిచితం. ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే మీడియాలో ఈ టెక్నాలజీ ప్రవేశించింది. తాజాగా టీ రంగంలోకి ఎంటర్ అయ్యింది. కరీంనగర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఆధారిత డిజిటల్ టీ షాప్ ప్రారంభమైంది. ఓనర్ అవసరం లేకుండానే టీ అభిమానులు ఇప్పుడు తమకు ఇష్టమైన టీని ఆస్వాదించవచ్చు. QR కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా కస్టమర్‌లు మంచినీరు, బిస్కెట్లు, టీని కొనుగోలు చేయవచ్చు.
ఈ వినూత్న సాంకేతికత టీ స్టాల్ ప్రపంచంలో ఒక మార్పును సూచిస్తుంది. ఇది టీ ఔత్సాహికులకు కొత్త శకానికి నాంది పలికింది. డిజిటల్ టీ దుకాణం ప్రారంభోత్సవంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, టీఎస్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బీ వినోద్ కుమార్, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు పాల్గొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 600కి పైగా మెషీన్లు అమ్ముడయ్యాయి. ఒకే త్రైమాసికంలో 10,000 వాటర్ టీ కాఫీ (WTC) వెండింగ్ మెషీన్లను ఇన్‌స్టాల్ చేయాని Gem Opencube Technologies Pvt. భావిస్తోంది. జెమ్ ఓపెన్‌క్యూబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ CEO పి వినోద్ కుమార్ మాట్లాడుతూ “మేం దేశం నలుమూలల నుండి బుకింగ్‌లను స్వీకరించాం. దేశవ్యాప్తంగా ఉన్న టీ ప్రియులకు ఈ కొత్త సాంకేతికతను అందుబాటులో ఉంచాలని మేం కోరుకుంటున్నాం” అని ఆయన అన్నారు.
Also Read: BRS joins: పాలకుర్తిలో కాంగ్రెస్ కు షాక్, బీఆర్ఎస్ లోకి యూత్ నాయకులు