Nagarkurnool: కొడుకు కంటే శారీరక సుఖమే ఎక్కువైంది ఓ తల్లికి
అక్రమ సంబంధం పెనుభూతంగా మారుతుంది. శారీరక సుఖం కుటుంబాలను విచ్చిన్నం చేస్తుంది. అడ్డొస్తే రక్తసంబంధీకుల్ని చంపేయడానికి కూడా సిద్దపడుతున్నారు. తాజాగా తెలంగాణాలోని నాగర్ కర్నూల్ లో అత్యంత దారుణం చోటు చేసుకుంది.
- Author : Praveen Aluthuru
Date : 21-03-2024 - 6:53 IST
Published By : Hashtagu Telugu Desk
Nagarkurnool: అక్రమ సంబంధం పెనుభూతంగా మారుతుంది. శారీరక సుఖం కుటుంబాలను విచ్చిన్నం చేస్తుంది. అడ్డొస్తే రక్తసంబంధీకుల్ని చంపేయడానికి కూడా సిద్దపడుతున్నారు. తాజాగా తెలంగాణాలోని నాగర్ కర్నూల్ లో అత్యంత దారుణం చోటు చేసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న కొడుకుని హతమార్చింది ఓ రాక్షస తల్లి. వివరాలలోకి వెళితే..
నాగర్ కర్నూల్ జిల్లా, బిజినపల్లి మండలం అల్లీపూర్ గ్రామంలో లక్ష్మి అనే మహిళ స్థానిక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే ప్రియుడు ఇంటికి రావడానికి లేదా, తానే అతని వద్దకు వెళ్ళడానికి అడ్డుగా కొడుకు హరీష్ ఉన్నాడని అంతమొందించాలనుకుంది. అనుకున్నదే తడవుగా ప్రియుడితో కలిసి హరీష్‌ను అత్యంత దారుణంగా హత్య చేసింది. కొడుకు తలపై రోకలితో బాది శవాన్ని వాటర్ ట్యాంక్‌లో పడేసింది. స్థానికంగా ఈ విషయం కలకలం రేపింది. పోలీసుల విచారణలో లక్ష్మి తన ప్రియుడు తప్పును ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు లక్ష్మిని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి, అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Thank You Captain: థాంక్యూ కెప్టెన్… ధోనీ ఫ్యాన్స్ ఎమోషనల్