HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >A Government Teacher Turned Daily Wage Laborer

కూలీగా మారిన ప్రభుత్వ టీచర్

  • Author : Vamsi Chowdary Korata Date : 14-04-2026 - 10:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lakshmirajam
Lakshmirajam

Lakshmirajam టీచర్ ఉద్యోగం కోసం 11 ఏళ్ల ప్రభుత్వ కొలువును వదులుకున్న ఓ వ్యక్తి జీవితం… కేవలం రెండు రోజుల ఆలస్యం కారణంగా తారుమారైంది. జగిత్యాల జిల్లాకు చెందిన లక్ష్మీరాజం, 8 నెలల పాటు టీచర్‌గా పనిచేసిన తర్వాత ఉద్యోగం కోల్పోయి, ఇప్పుడు కుటుంబ పోషణ కోసం భవన నిర్మాణ కార్మికుడిగా మారారు.

2012లో వీఆర్ఏగా ప్రభుత్వ సేవలో చేరిన లక్ష్మీరాజం, ఆ తర్వాత వార్డు ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. అయితే, డీఎస్సీలో మంచి ర్యాంక్ రావడంతో టీచర్ కావాలనే ఆశతో తన మున్సిపల్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2024 అక్టోబర్ 5న జరిగిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నాటికి ఆయన ఆర్సీఐ (రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) సర్టిఫికెట్ గడువు ముగిసింది. అయితే, రెన్యువల్ కోసం దరఖాస్తు చేసిన పత్రాలు చూపించి, అక్టోబర్ 7న ఢిల్లీలో సర్టిఫికెట్‌ను రెన్యువల్ చేయించుకుని సమర్పించారు.

ఆ తర్వాత నియామక పత్రం అందుకుని అక్టోబర్ 16న విధుల్లో చేరారు. సుమారు 8 నెలలు పనిచేసిన తర్వాత, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ నాటికి రెన్యువల్ కాలేదన్న సాంకేతిక కారణంతో అధికారులు ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ నిర్ణయంతో తీవ్ర ఆవేదనకు గురైన లక్ష్మీరాజం హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ‘స్టేటస్ కో’ ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ ఉద్యోగం లేకపోవడంతో, ప్రస్తుతం ఆయన సెంటరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం జగిత్యాల ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి, తనకు న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు.

దీనిపై జిల్లా విద్యాధికారి (డీఈఓ) రాము స్పందిస్తూ, వెరిఫికేషన్ రోజున ఆర్సీఐ సర్టిఫికెట్ రెన్యువల్ కాలేదని, ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఉన్నతాధికారుల ఆదేశాలతోనే చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. కలెక్టర్ జోక్యంతోనైనా తన సమస్య పరిష్కారమవుతుందని లక్ష్మీరాజం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Government Employee
  • High Court
  • Jagitial district
  • Lakshmirajam
  • RCI certificate
  • Teacher job loss
  • Telangana Teacher Recruitment

Related News

    Latest News

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ రికార్డులు ఇవే!

    • Lakshmi Parvathi: టీడీపీ పై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు

    • GV Anjaneyulu: విగ్రహాల ధ్వంసం.. అంతా జగన్ ప్లానే : జీవీ ఆంజనేయులు

    • War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు..

    • Drinking Water: మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో తాగునీటి సమస్యకు పరిష్కారం

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd