HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >30 Percent Hike In Wages Of Cultural Artists In Telangana

BRS Govt: సాంస్కృతిక సారథి కళాకారుల వేతనాలు 30 శాతం పెంపు

రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక సారథి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వేతనాలు పెంచింది.

  • Author : Balu J Date : 29-08-2023 - 11:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRS Gates Open
Cm Kcr

తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరుస్తూ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక సారథి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వేతనాలు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. భారత దేశంలో ఎక్కడా లేని విధంగా, తెలంగాణ ఉద్యమ కళాకారుల కుటుంబాలకు స్వ రాష్ట్రం లో భరోసా కల్పించేందుకు వారికి ప్రభుత్వ పరంగా సాంస్కృతిక సారథి సంస్థ ను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించడం దేశ చరిత్రలో మొదటిసారి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు గుర్తించి 583 మందికి ఉద్యోగాలు కల్పించారు.

ప్రతి నెల వారికి రూ.24,514 రుపాయల భృతిని కల్పించారు. సంక్షేమంలో భాగంగా కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అదనంగా 30 శాతం వేతనం పెంచుతూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుగారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పెరిగిన వేతనాల ప్రకారం వీరికి ఇకనుండి నెలకు రూ 31868/- అందనున్నాయి. సీఎం గారి ఆదేశాల మేరకు కొత్త వేతనాలు జూన్ 1, 2021 నుండి వర్తించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తమ గళాల్ని, కలాల్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన కళాకారులకు 2015 లో ఉద్యోగాలిచ్చారు. అప్పటి నుంచి వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న కళాకారులు ప్రభుత్వ ప్రగతి గీతాలను ఆలపిస్తూ, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ను పథకాలను ప్రజల వద్దకు చేర్చి వాటిని సద్వినియోగం పరుచుకొ నే దిశగా చైతన్యం చేస్తూ కీలక భూమిక పోషిస్తున్నారు. వీరి కృషిని గుర్తించిన సీఎం గారు కళాకారుల వేతనాలను పీఆర్ సీ-2020 పరిధిలోకి తెచ్చి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు వర్తింపచేయడం గొప్ప విషయం. కళాకారుల ఆర్థిక స్థాయిని మెరుగు పరుచడంతోపాటు సామాజిక భద్రతకు వేతనాల పెంపు నిర్ణయం దోహదం చేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • artists
  • brs govt
  • cm kcr
  • hyderabad

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

    • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

    • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

    • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd