Tragedy Incident: చిన్నారి ప్రాణం తీసిన కారు.. హైదరాబాద్ లో హృదయ విదారక ఘటన!
హైదరాబాద్ హయత్‌నగర్‌లోని లెక్చరర్స్ కాలనీలో హృదయ విదారక ఘటన జరిగింది.
- By Balu J Published Date - 01:26 PM, Thu - 25 May 23

ఎండ (Summer) నుంచి కాస్తా సేదతీరుతామని భావించిన ఓ చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది. పలువురిని కంటతడి పెట్టిస్తున్న ఈ ఘటన హైదరాబాద్ హయత్‌నగర్‌లోని లెక్చరర్స్ కాలనీలో జరిగింది. ప్రస్తుతం ఈ హృదయ విదారక ఘటన కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతోంది. అపార్ట్‌మెంట్ పార్కింగ్ ప్రాంతంలో కారు ఢీకొనడంతో మూడేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.
సీసీటీవీలో అందుకు సంబంధించిన ద్రుశ్యాలు రికార్డ్ అయ్యాయి. నిందితుడు హరి రామకృష్ణ తన వాహనాన్ని పార్క్ చేసేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తూ నిద్రిస్తున్న లక్ష్మి అనే బాలికపైకి కారును నడపడంతో బాలిక చనిపోయింది. బాలిక తల్లి కూలీ. తీవ్ర ఎండల కారణంగా కొద్దిసేసు విశ్రాంతి కోసం ఓ అపార్ట్ మెంట్ (Apartment) సెల్లార్ లో ఆగింది.
బిడ్డ లక్ష్మిని పార్కింగ్ ఏరియాలో పడుకోబెట్టి గుడ్డ కప్పేసింది. అయితే అదే సమయంలో దురదృష్టవశాత్తు, కృష్ణ ఇంటికి తన కారులో తిరిగి వచ్చాడు. అయితే కారును తన ప్రదేశంలో పార్క్ చేసే సమయంలో బాలికను గమనించగా, ఆమెపై నుంచి కారును నడిపాడు. దీంతో బాలిక అక్కడికక్కడే చనిపోయింది. బాలికపై గుడ్డ కప్పి ఉండడంతో తాను గమనించలేకపోయానని కృష్ణ విచారణలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
#Hyderabad: In a tragedy incident reported in Hayat Nagar RTC Colony, a 2 year old died after a car ran over it.
The mother works at a construction site and left the baby Lakshmi,in a nearby parking area. Unfortunately, a car ran over the baby, resulting in the child's death. pic.twitter.com/kq4eJ2mVie
— NewsMeter (@NewsMeter_In) May 24, 2023
Also Read: Indigo Flight: పక్షిని ఢీకొట్టిన ఇండిగో విమానం.. తప్పిన పెను ప్రమాదం
Related News

Hyderabad: హైదరాబాద్లో ఘరానా మోసం.. ఐటీ అధికారులమని చెప్పి 17 బంగారు బిస్కెట్లు అపహరణ.. నలుగురు అరెస్ట్
హైదరాబాద్ (Hyderabad)లోని ఓ దుకాణంలో ఆదాయపన్ను శాఖ అధికారులుగా చూపిస్తూ రూ.60 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను దొంగిలించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు.