HYDRA Demolitions: మూసీ పరిసర నివాసితులకు 2BHK ఇళ్లు: సీఎం రేవంత్
HYDRA Demolitions:ఫుల్ ట్యాంక్ లెవల్ లేదా సరస్సుల బఫర్ జోన్‌లలో భూమిని ఆక్రమించిన ప్రజలు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఎఫ్‌టిఎల్ లేదా బఫర్ జోన్‌లలోని అన్ని ఆక్రమణల కూల్చివేతలను హైడ్రా నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
- By Praveen Aluthuru Published Date - 02:26 PM, Wed - 11 September 24

HYDRA Demolitions: హైడ్రా సంస్థపై పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీపి కబురు అందించారు. అయితే అంతకుముందు హైడ్రా(Hydra) పేదల విషయంలో సానుకూలత చూపించింది. కొత్తగా నిర్మించే కట్టడాలను మాత్రమే కూలుస్తామని, నివాసాల జోలికి వెళ్లబోమని చెప్పింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ నది వెంబడి నివాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఫుల్ ట్యాంక్ లెవల్ లేదా సరస్సుల బఫర్ జోన్‌లలో భూమిని ఆక్రమించిన ప్రజలు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఎఫ్‌టిఎల్ లేదా బఫర్ జోన్‌లలోని అన్ని ఆక్రమణల కూల్చివేతలను హైడ్రా నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసు అకాడమీలో జరిగిన ఎస్‌ఐ పాసింగ్ ఔట్ పరేడ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మూసీ నది పక్కన ఉన్న 11 వేల మంది పేదలకు 2బీహెచ్‌కే ఇళ్లు అందజేస్తామన్నారు. నదిలోని ఎఫ్‌టిఎల్ మరియు బఫర్ జోన్‌లను క్లియర్ చేస్తామన్నారు. ఇకపై మూసీ పక్కన ఉన్న నివాసితులు వర్షాకాలంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం చెప్పారు. వర్షాకాలంలో హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ఎగువ నుండి నీటిని విడుదల చేయడం వల్ల మూసీ నది ఉప్పొంగి ప్రవహించడంతో చుట్టూ ప్రక్కల ప్రాంతాల నివాసితులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, ఆయన భాగస్వామి రమేష్‌లు అమీన్‌పూర్ సరస్సు సమీపంలోని స్థలాలను ఆక్రమించారని ఆరోపించారు. దీంతో అతనిపై క్రిమినల్ కేసు నమోదైంది.
హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు నిర్వహిస్తున్నప్పటికీ, కూల్చివేత కార్యక్రమాలలో భాగంగా ఆక్రమిత ఇళ్లను కూల్చివేయబోమని ఇటీవల ప్రజలకు హామీ ఇచ్చింది. మరి నగరంలోని సరస్సుల పునరుద్ధరణ కోసం హైడ్రా తన డ్రైవ్‌ను ఎలా కొనసాగిస్తుందో చూడాలి. కాగా అక్కినేని నాగార్జున అక్రమ కట్టడాలను కూల్చేసి హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పెరుగెట్టిస్తోంది. మూడు నెలల కాలంలోనే 300 పైగా అక్రమ కట్టడాలను హైడ్రా నేలకూల్చింది. హైడ్రా కూల్చివేతలు మునుముందు జోరుగా కొనసాగించనుంది.
Also Read: Amit shah : దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం రాహుల్‌కు అలవాటే: అమిత్ షా