HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >144 Section Till 29th June In Hyderabads Miyapur And Chandanagar

144 Section : మియాపూర్‌, చందానగర్‌‌లలో ఈనెల 29 వరకు 144 సెక్షన్‌.. ఎందుకు ?

సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

  • Author : Pasha Date : 23-06-2024 - 3:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
144 Section

144 Section : సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌, చందానగర్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో ఈ నెల 29 అర్ధరాత్రి వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఆయన ప్రకటించారు. మియాపూర్‌లో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టామని తెలిపారు. మియాపూర్‌ శివార్లలో వివాదాస్పదంగా మారిన భూములను అవినాష్ మహంతి స్వయంగా పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

We’re now on WhatsApp. Click to Join

శనివారం రోజు హైదరాబాద్ శివారులోని సర్కారు భూముల్లో గుడిసెలు వేసేందుకు దాదాపు 2వేల మంది ఒక్కసారిగా యత్నించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్‌ ప్రశాంత్‌నగర్‌ సమీపంలో ఉన్న సర్వే నంబరు 100, 101లో దాదాపు 525 ఎకరాల్లో గుడిసెలు వేసేందుకు వీరంతా ప్రయత్నించారు. వారిని నిలువరించే క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేశారు. దీంతో పోలీసులపైకి పలువురు రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి ఈనెల 29వ తేదీ అర్థరాత్రి వరకు మియాపూర్‌, చందానగర్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో 144 సెక్షన్‌‌ను(144 Section) విధిస్తూ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

Also Read : CM Chandrababu : సీఎం చంద్రబాబు కొత్త సంప్రదాయం.. ఇక నుంచి ప్రతీ శనివారం..!

దేశ విభజన సందర్భంగా కొంతమంది అప్పట్లో పాకిస్తాన్‌కు వలస వెళ్లిపోయారు. అలాంటి  భూములను చట్ట పరిభాషలో అవెక్యూ ల్యాండ్స్ అంటారు. అలాంటివి దాదాపు 525 ఎకరాల ల్యాండ్స్ మియాపూర్ శివార్లలో ఉన్నాయి. వాటిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు అప్పగించింది. అయితే ఈ భూములను తాము కొన్నామంటూ  32 మంది కోర్టును ఆశ్రయించారు. అయితే దిగువ కోర్టుల నుంచి హైకోర్టు దాకా తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఆ 32 మంది వ్యక్తులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ప్రస్తుతం దేశ సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఈ విలువైన భూమికి సంబంధించిన కేసు ఉంది. ఈ అవెక్యూ భూమిలో దాదాపు 50 ఎకరాలు ఇప్పటికే కబ్జాలకు గురైందని తెలుస్తోంది.

Also Read : Siddharth Mallya : విజయ్‌మాల్యా ఎస్టేట్‌లో సిద్ధార్థ్‌ మాల్యా పెళ్లి.. క్రైస్తవ సంప్రదాయంలో వేడుక


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 144 section
  • Chandanagar
  • hyderabad
  • Miyapur
  • pakistan

Related News

Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ అధికార కూటమిలో భాగం కాగా.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జనసేన పార్టీ సభ నిర్వహణకు పోలీసులు, హైకోర్టు అనుమతులు ఇవ్వకపోవడం.. అధికార కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేయడంతో.. వాటన్

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

  • Heavy rain forecast for Telangana.

    Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

  • Sister of Women's Commission Chairperson Gadwal Vijayalakshmi goes missing.

    Gadwal Vijaya Laxmi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి అదృశ్యం

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd