Chat GPT : చాట్ జీపీటీని తెగ వాడేస్తున్న కంపెనీల సీఈవోలు.. ఎవరంటే..
చాట్ జీపీటీ.. ప్రస్తుతం ఈ పేరు తెలియనివారు ఎవరూ ఉండరు. గత కొంతకాలంగా ఈ పేరు మారుమ్రోగిపోతుంది. టెక్ ప్రపంచంలో అర్టిఫిషియల్ ఆధారిత చాట్ జీపీటీ ఒక సంచలనంగా మారింది. టెక్నాలజీ ప్రపంచంలో ఈ టూల్ ఒక పెను మార్పులకు దారి తీస్తోంది.
- By Nakshatra Published Date - 10:00 PM, Wed - 3 May 23
Chat GPT : చాట్ జీపీటీ.. ప్రస్తుతం ఈ పేరు తెలియనివారు ఎవరూ ఉండరు. గత కొంతకాలంగా ఈ పేరు మారుమ్రోగిపోతుంది. టెక్ ప్రపంచంలో అర్టిఫిషియల్ ఆధారిత చాట్ జీపీటీ ఒక సంచలనంగా మారింది. టెక్నాలజీ ప్రపంచంలో ఈ టూల్ ఒక పెను మార్పులకు దారి తీస్తోంది. ఏ సమాచారం కావాలన్నా చాట్ జీపీపీ క్షణాల్లో మొత్తం చెప్పేస్తుంది. అందేకు మనం అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు చెబుతుంది. దీంతో చాట్ జీపీటీకి బాగా ఆదరణ పెరిగిపోతుంది. చాట్ జీపీటీ రాకతో ఇలాంటి టూల్స్ చాలా కొత్తగా పుట్టుకొస్తున్నాయి.
అయితే చాలామంది కంపెనీ సీఈవోలు చాట్ జీపీటీని వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల ఎంతో ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. కానీ కొంతమంది సీఈవోలు మాత్రం చాట్ జీపీటీని ఉపయోగించేందుకు తెగ పోటీ పడుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన అవతార్ టెక్నాలజీ కంపెనీ జెనీస్ సీఈవో ఆకాష్ నిఘమ్ కూడా చాట్ జీపీటీని విపరీతంగా వినియోగిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఆయన సంస్థలో 120 మంది పనిచేస్తున్నారు. దీంతో చాట్ జీపీటీ పెయిడ్ సబ్స్క్రిప్షన్ కోసం నెలకు రూ.2 లక్షలకుపైగా ఖర్చు పెడుతున్నారట.
చాట్ జీపీటీ వినియోగంతో ఇంజినీరింగ్, ప్రొడక్ట్, ఫైనాన్స్, డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అకౌంటిగ్తో పాటు ఇతర విభాగాల్లో ప్రొడక్టివిటీ బాగా పెరిగిందట. చాల్ జీపీటీ ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. ఎన్నో సమస్యలకు చాట్ జీపీటీ పరిష్కారం చూపుతుందని, దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆకాష్ నిఘమ్ చెబుతున్నారు. మ్యాథ్స్, కోడింగ్ లోని సమస్యలను పరిష్కరిస్తుందని అంటున్నారు. తమకు కావాల్సిన ప్రజెంటేషన్ స్క్రిఫ్ట్‌ను ఏఐ చాట్‌బాట్ తయారుచేస్తుందని అంటున్నారు.
Tags
Related News
T-Sat CEO: టి-సాట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
తెలంగాణ స్కిల్, అకడమిక్ అండ్ ట్రైనింగ్ టి-శాట్ నెట్వర్క్ ఛానళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ప్రముఖ పాత్రికేయులు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి నేడు అధికారిక బాధ్యతలు స్వీకరించారు.