WhatsApp Status : సరికొత్త ఫీచర్.. వాట్సాప్ స్టేటస్ నేరుగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలోకి
త్వరలోనే ఒకే ఒక్క క్లిక్‌తో వాట్సాప్ స్టేటస్ నేరుగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలోనూ(WhatsApp Status) ప్రత్యక్షం అవుతుంది.
- By Pasha Published Date - 06:17 PM, Wed - 22 January 25

WhatsApp Status : కొత్త కొత్త ఫీచర్లతో వాట్సాప్ దూసుకుపోతోంది. గత ఏడాది వ్యవధిలో వాట్సాప్‌లోని ప్రతీ సెక్షన్‌లోకి నూతన ఫీచర్లు వచ్చి చేరాయి. త్వరలోనే మరో అద్భుత ఫీచర్ వాట్సాప్ యూజర్లకు ఉపయోగపడనుంది. ఇది కచ్చితంగా వారి సమయాన్ని ఆదా చేస్తుంది. ఇంతకీ అదే ఫీచర్ ? అని ఆలోచిస్తున్నారా ? తెలుసుకుందాం రండి.
Also Read :Nitish Kumar: రాజకీయాల్లో సంచలనం.. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న నితీష్ కుమార్!
సమయం ఆదా చేసేలా..
వాట్సాప్‌లో ఆకట్టుకునే విభాగం ‘స్టేటస్’. చాలామంది తీరొక్క స్టేటస్‌లతో అలరిస్తుంటారు. బర్త్ డేలు, వివాహ దినోత్సవాలు, శుభ కార్యాలు, సన్నిహితుల స్మరణలు, మోటివేషనల్ సందేశాలు ఇలా రకరకాల అంశాలపై వాట్సాప్ యూజర్లు స్టేటస్‌లు పెడుతుంటారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలోనూ ఇవే వివరాలతో ప్రత్యేకంగా పోస్ట్‌లు, స్టేటస్‌లు పెట్టేవారు. ఇందుకోసం అదనంగా సమయాన్ని వెచ్చించాల్సి వచ్చేది. త్వరలోనే ఒకే ఒక్క క్లిక్‌తో వాట్సాప్ స్టేటస్ నేరుగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలోనూ (WhatsApp Status) ప్రత్యక్షం అవుతుంది. అదెలా సాధ్యం ? అంటే.. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను ఇంటిగ్రేట్ చేశారు. అవన్నీ ఇప్పుడు కలిసికట్టుగా మెటా కంపెనీ గొడుగు కింద పనిచేస్తున్నాయి. మెటా అధినేత మరెవరో కాదు.. అమెరికాకు చెందిన బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్.
Also Read :Kidney Racket : హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ కలకలం.. నిజానిజాలు ఏమిటి ?
ఆ రెండు ఆప్షన్లు ఉంటాయ్
వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లోనూ స్టోరీగా చేసేందుకు ఇప్పటికే ఒక ఆప్షన్ వాట్సాప్‌లో అందుబాటులో ఉంది. వాట్సాప్‌లో స్టేటస్‌ను పెట్టే క్రమంలో .. మనకు Facebook story అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే మన వాట్సాప్ స్టేటస్ నేరుగా ఫేస్‌బుక్ స్టోరీగా డిస్‌ప్లే అయిపోతుంది. ఇకపై అక్కడ అదనంగా Instagram story అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే మన వాట్సాప్ స్టేటస్ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ కనిపిస్తుంది. తద్వారా పదేపదే ఆ యాప్‌లలోకి వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. ఒకవేళ మన వాట్సాప్ స్టేటస్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో కనిపించకూడదని భావిస్తే.. ఆ రెండు ఆప్షన్లను డిజేబుల్ చేయాలి. విడతలవారీగా ఈ ఫీచర్‌ను వాట్సాప్ యూజర్లు అందరికీ అందుబాటులోకి తేవాలని మెటా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.