WhatsApp New Feature: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. స్పామ్ కాల్స్ కి చెక్ పెట్టండిలా?
రోజురోజుకీ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా వినియోగదారుల కోసం కొత
- By Nakshatra Published Date - 06:31 PM, Thu - 29 June 23
రోజురోజుకీ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకు వస్తోంది. మరి ముఖ్యంగా వినియోగదారుల ప్రైవసీ విషయంలో, డేటా భద్రత విషయంలో ప్రత్యేకంగా శ్రద్ద వహిస్తోంది. మరి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ల లోని యాప్ లలో వినియోగదారుల డేటా మొత్తం ఉంటుడంతో దానిని కాపాడటం పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. దీనికి తోడు ఈ మధ్యకాలంలో తెలియని నంబర్ల నుంచి ఫోన్లు, మెసేజ్ లతో వినియోగదారులు విసిగిపోతున్నారు. వీడియో కాల్స్ ఆడియో కాల్స్ మెసేజ్ లతో విసిగిపోతున్నారు వినియోగదారులు.
ఈ క్రమంలోనే వాట్సాప్ సంస్థ ఒక కొత్త అప్ డేట్ ను తీసుకువచ్చింది. సైలెన్స్ అన్ నోన్ కాలర్స్ పేరుతో ఈ ఫీచర్ ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా స్పామ్ కాల్స్, తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ లకు చెక్ పెట్టవచ్చు. మరి ఆ వివరాల్లోకి వెళితే.. వాట్సాప్ సంస్థ వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే అనేక రకాల కొత్త ఫీచర్లు, అప్ డేట్లను వాట్సాప్ తీసుకొచ్చిన వాట్సాప్ వినియోగదారుల కాల్స్, మెసేజ్ లు భద్రంగా ఉండేందుకు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సైలెన్స్ అన్ నోన్ కాలర్స్ ఫీచర్ ను తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ ద్వారా మీరు స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్, తెలియని వారి నుంచి వచ్చే కాల్స్ నుంచి మిమ్మల్ని హైడ్ చేస్తుంది. అయితే ఈ కాల్స్ లిస్ట్ మాత్రం మీకు మీ కాల్ లిస్ట్ లో చూపిస్తుంది. కాల్ వచ్చినప్పుడు మాత్రం అవి సైలెంట్ అయిపోతాయి. అసలు కాల్ వచ్చినట్టు కూడా మీకు తెలియదు. కాల్ వచ్చినప్పుడు రింగ్ కూడా రాదు. ఒకవేళ మీకు తెలిసిన వారిది అయితే కాల్ లిస్ట్ ఉంటుంది కాబట్టి తిరిగి కాల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేయడానికి మీరు వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాక్టివేట్ చేయచ్చు.
Related News
Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత రెండు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాస్తవానికి అతని వాట్సాప్ ఖాతా బ్లాక్ అయింది. దీని కారణంగా సోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే 61 గంటల తర్వాత అతని వాట్సాప్ ఖాతా మళ్లీ యాక్టివ్గా మారింది.