Vivo X200: మార్కెట్లోకి వచ్చేసిన వివో ఎక్స్ 200 సిరీస్.. లాంచ్ అయ్యేది అప్పుడే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో ఇప్పుడు మార్కెట్లోకి మరి కొన్ని కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల చేయబోతోంది.
- By Anshu Published Date - 10:33 AM, Wed - 4 December 24
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వివో ఇప్పుడు మార్కెట్లోకి మరోసారి కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన వివో వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫోన్స్ ని తీసుకువస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మార్కెట్ లోకి సరికొత్త వివో ఎక్స్200 సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి. వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. మీడియాటెక్ డైమన్షిటీ 9400 ఎస్ఓసీలు, Zeiss బ్రాండెడ్ కెమెరాలతో కొత్త ఎక్స్ సిరీస్ హ్యాండ్‌సెట్ లు దేశంలో అమెజాన్ ద్వారా విక్రయించనుంది. వివో ఎక్స్200 సిరీస్ ఈ సంవత్సరం అక్టోబర్ లో కంపెనీ స్వదేశమైన చైనాలో విడుదలైంది.
ఈ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15తో వస్తాయి. చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రోలను డిసెంబర్ 12 మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. వివో మార్కెటింగ్ మెటీరియల్ లో ఫోన్ ల కెమెరా పర్ఫార్మెన్స్ హైలైట్ చేసింది. వివో ఎక్స్200 ప్రో భారత మొట్ట మొదటి 200ఎంపీ ఏపీఓ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇకపోతే వివో ఎక్స్200 సిరీస్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. వివో ఇండియా, అమెజాన్ తమ వెబ్‌సైట్ లలో ప్రత్యేక ల్యాండింగ్ పేజీ ద్వారా వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో రాకను సూచిస్తున్నాయి. ఈ ఫోన్ లు మీడియాటెక్ డైమన్షిటీ 9400 ఎస్ఓసీ, Zeiss బ్రాండెడ్ కెమెరాలతో వస్తుందని అంచనా.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15 ని కలిగి ఉంటాయి. వివో ప్రో మోడల్ కాస్మోస్ బ్లాక్, టైటానియం గ్రే కలర్‌వేస్ లో లాంచ్ కానుంది. అలాగే వెనిలా మోడల్ కాస్మోస్ బ్లాక్, నేచురల్ గ్రీన్ షేడ్స్‌లో రానుంది. వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో వరుసగా 5,800mAh, 6,000mAh బ్యాటరీలను ప్యాక్ చేస్తాయి. రెండోది వి3 ప్లస్ ఇమేజింగ్ చిప్, 200ఎంపీ Zeiss ఏపీఓ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో అక్టోబర్‌లో వివో X200 మినీతో పాటు చైనాలో లాంచ్ అయ్యాయి. మినీ మోడల్ చైనీస్ మార్కెట్‌కు ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నారు. వనిల్లా మోడల్ బేస్ 12జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ సీఎన్‌వై 4,300 అనగా దాదాపు రూ. 51వేలు ప్రారంభ ధర ట్యాగ్‌తో వచ్చింది. ఇక వివో ఎక్స్200 ప్రో అదే ర్యామ్, స్టోరేజ్ ట్రిమ్ సీఎన్‌వై 5,999 అనగా సుమారు రూ. 63వేలు వద్ద ప్రారంభమవుతుందట. 90డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్, సపోర్టును పొందవచ్చు. 32ఎంపీ ఫ్రంట్ కెమెరాలతో పాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆరిజిన్ OS5పై రన్ అవుతాయి.