HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Vivo T2 Pro 5g India Launch Check Date Features Design Price And More Details

Vivo T2 Pro 5G: మార్కెట్లోకి మరో వివో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం వివో సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో వివో సంస్థ ఒకదాని తర్వాత ఒకటి మార్కెట్లోకి స్మార్ట్

  • Author : Anshu Date : 15-09-2023 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vivo T2 Pro 5g
Vivo T2 Pro 5g

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం వివో సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో వివో సంస్థ ఒకదాని తర్వాత ఒకటి మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అద్భుతమైన ఫీచర్లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరొక స్మార్ట్ ఫోన్ ను కూడా మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. వివో T2 ప్రో 5జీ తో పేరుతో మన దేశంలో కొత్త బడ్జెట్ T-సిరీస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ డివైజ్‌ను సెప్టెంబర్ 22 భారతదేశంలో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

కొత్త ఫోన్ లాంచ్ తేదీని వివో ఇండియా మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ లో రిలీజ్ చేసింది. ఎపిక్ గేమింగ్, స్ట్రీమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ కోసం వివో T2 ప్రో 5G రాబోతున్నట్లు ట్వీట్‌లో పేర్కొంది. అయితే భారత్ లో వివో టీ2 ప్రో 5జీ ధర ఎంత ఉంటుందనే వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ డివైజ్ సుమారు రూ.23,999 ధరతో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 91మొబైల్స్ రిపోర్ట్ ప్రకారం.. కొత్త ఫోన్ iQOO Z7 Pro 5G మాదిరిగా, అదే ధరతో రావచ్చు. ఈ ఐక్యూ ఫోన్ గత నెలలో రూ.24వేలకు లాంచ్ అయింది. అయితే అధికారిక లాంచింగ్ తర్వాతే అసలు ధరల వివరాలు వెల్లడి కానున్నాయి. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే…

ఈ డివైజ్ కోసం వివో ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ మైక్రో-సైట్‌ను కూడా క్రియేట్ చేసింది. ఈ మైక్రో సైట్‌లో షేర్ చేసిన టీజర్ ఇమేజ్ ప్రకారం రాబోయే వివో T2 ప్రో 5జీ ఫోన్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానున్నట్లు తెలుస్తోది. సెల్ఫీల కోసం స్క్రీన్ మధ్యలో కెమెరా కటౌట్‌తో కూడిన డిస్‌ప్లే ఆకట్టుకుంటోంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 64ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ యూనిట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 4కె వీడియోలను క్యాప్చర్ చేయగలదు. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ డివైజ్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చని నివేదిక వెల్లడించింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌తో రానుంది. 8జీబీ ర్యామ్,128జీబీ , 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభించనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • india
  • price
  • Vivo T2 Pro 5G
  • Vivo T2 Pro 5G smart phone

Related News

Election Dates

దేశంలో మ‌రోసారి ఎల‌క్ష‌న్స్‌.. 4 రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే!

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు. ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో విపక్షాల కోటలను బద్దలు కొట్టేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

  • Modi Speech

    Crisis : సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు – బిజెపి

  • Kerosene

    Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Mobile Number Numerology

    Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Latest News

  • ఎంపీ పుట్టా మహేశ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్

  • TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

  • మరో వివాదంలో సింగర్ మంగ్లీ

  • ఇంటర్ విద్యార్థులకు రూపాయికే ఆన్‌లైన్లో పోటీ పరీక్ష

  • ‘She The Change’ 2026: హైదరాబాద్ శ్రీదేవి జాస్తికి స్విగ్గీ గౌరవం

Trending News

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd