Vivo y77t: మార్కెట్ లోకి మరో వివో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర,ఫీచర్స్ ఇవే?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో ఇప్పటికే ఎన్నో రకాల ఆండ్రాయిడ్ ఫోన్ లను అద్భుతమైన ఫీచర్ లతో మార్కెట్ లోకి విడుదల చేసిన
- By Anshu Published Date - 07:30 PM, Tue - 22 August 23

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో ఇప్పటికే ఎన్నో రకాల ఆండ్రాయిడ్ ఫోన్ లను అద్భుతమైన ఫీచర్ లతో మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా వివో సంస్థ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మార్కెట్లోకి రకరకాల మొబైల్ ఫోన్ లను తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో వివో స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. వివో వై 77టీ పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ మనకు రెండు వేరియంట్స్‌లో లభించనుంది.
8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,000 కాగా 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 18,000 గా ఉంది. అయితే ప్రస్తుతం చైనా మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే ఇండియాలోకి లాంచ్ చేయనున్నారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.64 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ + డిస్‌ప్లేను అందించారు. 2388 x 1080 పిక్సెల్ రిజల్యూషన్ ఈ ఫోన్ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్‌ఓసీ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆరిజిన్ ఓస్3ని ఇచ్చారు.
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక సెల్ఫీల కోసం ఇందులో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 44 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని కూడా అందించారు. అలాగే యూఎస్‌బీ టైప్‌సి ఛార్జింగ్ పోర్ట్‌ను అందించారు. బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ మనకు రెండు మూడు కలర్స్ లో లభించనుంది.