Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ ధర రూ.900
ట్విట్టర్ తన చందాదారుల కోసం భారత్ లో బ్లూ టిక్ సేవలు మొదలు పెట్టింది.
- Author : Maheswara Rao Nadella
Date : 09-02-2023 - 11:15 IST
Published By : Hashtagu Telugu Desk
ట్విట్టర్ (Twitter) తన చందాదారుల కోసం భారత్ లో బ్లూ టిక్ (Blue Tick) సేవలు మొదలు పెట్టింది. నెలకు రూ. 900 చెల్లించి ఎవరైనా తమ ప్రొఫైల్ కోసం బ్లూ టిక్ మార్క్ పొందొచ్చు. చందా చెల్లించిన అనంతరం వారి ప్రొఫైల్ వద్ద బ్లూటిక్ మార్క్ కనిపిస్తుంది. నిజమైన ప్రొఫైల్ అని చెప్పేందుకు ఇది ధ్రువీకరణగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు ట్విట్టర్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ (Twitter Premium Subscription) సేవలు కొన్ని దేశాల్లోనే ఉండగా, భారత్ (India) కు సైతం వాటిని తీసుకొచ్చింది. ప్రొఫైల్ కు బ్లూ టిక్ మార్క్ ఒక్కటే కాకుండా.. పెద్ద పోస్ట్ లు పెట్టుకోవచ్చు. కొత్తగా తీసుకొచ్చే ఫీచర్లను ముందుగా వినియోగించుకోవచ్చు. ట్వీట్ పెట్టిన తర్వాత 30 నిమిషాల్లోపు ఐదు సార్లు ఎడిట్ చేసుకోవచ్చు. వీడియోలను పూర్తి రిజల్యూషన్ తో షేర్ చేసుకోవచ్చు. ట్విట్టర్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని 90 రోజులు నిండిన వారే బ్లూ టిక్ మార్క్ తీసుకోగలరు. ఫోన్ నంబర్ ను ధ్రువీకరించాల్సి ఉంటుంది. బ్లూ టిక్ చందాదారులకు ప్రకటనల ఆదాయంలోనూ వాటా లభిస్తుంది.
Also Read: Ashika Ranganath: నా డ్రీమ్ ఇదే.. ఆషిక రంగనాథ్