Instagram: ఇంస్టాగ్రామ్ వినియోగదారులకు శుభవార్త.. వాట్సాప్ మాదిరిగా లాస్ట్ సీన్ హైడ్ చేయండిలా?
సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్,టెలిగ్రామ్ అంటూ ఎన్నో రకాల సోషల్ మీడియా యాప్ లను వినియోగిస్తున్నారు. చాట
- By Nakshatra Published Date - 07:41 PM, Tue - 29 August 23
సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్,టెలిగ్రామ్ అంటూ ఎన్నో రకాల సోషల్ మీడియా యాప్ లను వినియోగిస్తున్నారు. చాటింగ్ వీడియో కాల్స్ ఇలా అనేక రకాల వాటి కోసం ఈ సోషల్ మీడియా యాప్స్ ని వినియోగిస్తున్నారు. ఇక అందులో భాగంగానే ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది వినియోగిస్తున్న వాటిలో ఇన్స్టాగ్రామ్ కూడా ఒకటి. రోజురోజుకీ వినియోగదారుల సంఖ్య పెరిగిపోవడంతో ఆ సంస్థ కూడా వినియోగదారుల కోసం రకరకాల ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అందులో భాగంగానే తాజాగా వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఇన్స్టాగ్రామ్ సంస్థ. ఆ వివరాల్లోకి వెళితే..
మామూలుగా మనకు వాట్సాప్ లో లాస్ట్ సీన్ ని హైడ్ చేసే ఫీచర్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే ఫీచర్ ఇన్స్టాగ్రామ్ సంస్థ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్ ను ఎలా వినియోగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివిటీ స్టేటస్ అనేది వ్యక్తులను అకౌంట్లను ఫాలో అవడానికి, అలాగే వారు ఆన్ లైన్లో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫేస్ బుక్ మెస్సేంజర్, వాట్సాప్ లలో ఉండే ఫీచర్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఫీచర్ సాయంతో మీ ప్రైవసీని మీరు కాపాడుకోవచ్చు. మీరు యాప్ లో ఉన్నారో లేదో అంటే ఆన్ లైన్ లో ఉన్నారో లేదో బయటి వ్యక్తులకు తెలియకుండా కాపాడుతుంది.
మొదటిగా మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి. దానిలో మీ ప్రొఫైల్ ని యాక్సెస్ చేసేందుకు యాప్ లో కుడిచేతి వైపు కింద ఉన్న ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ప్రొఫైల్ పేజీలో కుడి చేతి వైపు పైన ఉన్న మూడు గీతలపై క్లిక్ చేయాలి. వచ్చిన ఆప్షన్లలో నుంచి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ లోకి వెళ్లాలి. దానిలో మెసేజెస్ అండ్ స్టోరీ రిప్లైస్ సెక్షన్ లోకి వెళ్లి షో యాక్టివిటీ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దానిని స్విచ్ ను ఆఫ్ చేసేయాలి. అలా చేస్తే మీరు యాప్ ఉన్నప్పటికీ మీ స్టేటస్ చూపించదు. దీని ద్వారా మీ ఆన్ లైన్ స్టేటస్ బయటి వ్యక్తులకు కనిపించదు. మీ ప్రైవసీ భద్రంగా ఉంటుంది.
Related News
Instagram Down: మరోసారి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్.. ట్విట్టర్లో ఫిర్యాదులు..!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వర్లు డౌన్ (Instagram Down) అయినట్లు సమాచారం వెలుగులోకి వస్తోంది.