Samsung S23: మార్కెట్ లోకి శాంసంగ్ ఎస్23.. ధర ఫీచర్స్ ఇవే?
శాంసంగ్ వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల
- By Nakshatra Published Date - 07:00 AM, Sat - 14 January 23
శాంసంగ్ వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. కాగా శాంసంగ్ వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శాంసంగ్ ఎస్ 23 సిరీస్ ను ఆ కంపెనీ భారత మార్కెట్ లోకి లాంచ్ చేయనుంది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన చేసింది. వచ్చే నెల ఫిబ్రవరి 1న గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు అఫిషియల్ గా అనౌన్స్ చేసింది శాంసంగ్ సంస్థ.
అయితే ఈ ఈవెంట్ లో శాంసంగ్ నూతన మోడల్ అయిన గెలాక్సీ ఎస్ 23ను రిలీజ్ చేస్తుందని తెలిస్తోంది. ఇక అందులో 200 ఎంపీ కెమెరాతో పాటు, శాటిలైట్ కనెక్టవిటీ తో పాటు మరెన్నో అప్ గ్రేడెడ్ ఫీచర్స్ ఈ ఫోన్ లో శాంసంగ్ అందించనుంది. అయితే ఈ ఫోన్ మూడు ప్రధాన వేరియంట్ లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23, సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 23 ప్లస్, సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా మోడల్స్ లో కంపెనీ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ ని వినియోగదారులు రిలీజ్ చేయగానే ప్రీ ఆర్డర్ బుకింగ్స్ ను అందుబాటులోకి తీసుకురానుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఫోన్ కోసం సామ్ సంగ్ స్టోర్స్, అలాగే సామ్ సంగ్ వెబ్ సైట్ తో పాటు అమెజాన్ షాపింగ్ వెబ్ సైట్ ద్వారా ప్రీ ఆర్డర్స్ ను బుక్ చేయవచ్చు. అయితే ప్రీ ఆర్డర్ చేయడానికి రూ.1999 ముందే వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రీ ఆర్డర్ చేసిన వారికి రూ.5000 విలువైన అదనపు ప్రయోజనాలను కంపెనీ అందించనుంది. అయితే అదనపు ప్రయోజనాలు కావాలంటే ఈ మొబైల్ ను మార్చి 31, 2023 లోపు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఫీచర్ ల విషయానికి వస్తే.. శాంసంగ్ వన్ యూఐ సపోర్ట్ తో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో పని చేస్తుంది. అలాగే ఈ ఫోన్ లో శాటిలైట్ కనెక్టవిటీ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ధర విషయానికి వస్తే.. ఈ మోడల్ ప్రారంభ ధర దాదాపు రూ.70 వేల కంటే ఎక్కువ ఉంటుందని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Related News
Infinix: స్మార్ట్ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ ధరలో రెండు ఫోన్లు లాంచ్..!
టెక్ కంపెనీ ఇన్ఫినిక్స్ (Infinix) తన బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ఫోన్ సిరీస్ 'Infinix Note 40 Pro 5G'ని విడుదల చేసింది.