Samsung Fake Moon Shots: శాంసంగ్ ఫేక్ మూన్ షాట్స్.. ఏమిటి? శాంసంగ్ ఏం చెప్పింది?
శాంసంగ్ అల్ట్రా సిరీస్ స్మార్ట్‌ఫోన్లలోని కెమెరా జూమింగ్ సామర్థ్యం ఫీచర్ పై ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా
- By Maheswara Rao Nadella Published Date - 02:00 PM, Thu - 16 March 23

శాంసంగ్ అల్ట్రా సిరీస్ (Samsung Ultra Series) స్మార్ట్ ఫోన్లలోని కెమెరా జూమింగ్ సామర్థ్యం ఫీచర్ పై ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా సిరీస్ ఫోన్ లోని స్పేస్ జూమ్ ఫీచర్ పై డిస్కషన్ జరుగుతోంది. అయితే గెలాక్సీ S సిరీస్ స్మార్ట్‌ఫోన్ తీసే స్పేస్ జూమ్ ఫోటోలు, మూన్ షాట్ లు నకిలీవని తాను గుర్తించా నంటూ ఓ రెడిట్ యూజర్ ఇటీవల ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఈనేపథ్యంలో తాజాగా శాంసంగ్ స్పందించింది. నకిలీ మూన్ షాట్ ఆరోపణలను ఖండించింది.
అది ‘నకిలీ’ వివరణాత్మక మూన్ షాట్ కాదని.. కెమెరా యాప్ లోని “సీన్ ఆప్టిమైజర్” ఫీచర్ వల్ల ఆ ఎఫెక్ట్ వస్తుందని చెప్పింది. సీన్ ఆప్టిమైజర్ వల్లే చంద్రుని యొక్క ఫోటోలు క్లియర్ గా వస్తాయని శాంసంగ్ వెల్లడించింది. కెమెరాను 25x లేదా అంతకంటే ఎక్కువ జూమ్ చేసినప్పుడు, “సూపర్ రిజల్యూషన్” ద్వారా 10కి పైగా చిత్రాలను మిళితం చేసి ఫోటోను స్పష్టంగా మార్చేందుకు “సీన్ ఆప్టిమైజర్” ఉపయోగ పడుతుందని పేర్కొంది. ఈక్రమంలో సౌండ్ ఎక్స్‌పోజర్‌ను కూడా తగ్గిస్తుందని తెలిపింది. ఆప్టికల్, డిజిటల్ స్టెబిలైజేషన్‌ని కలపడం ద్వారా చంద్రుడి ఫోటోలో అస్పష్టతను తొలగిస్తుందని వివరించింది. చివరగా.. “జూమ్ లాక్” ఫీచర్ ద్వారా చంద్రుడి ఇమేజ్ బ్లర్ కాకుండా యూజర్ కు కనిపిస్తుందని పేర్కొంది.
చంద్రుడి ఫోటోలను క్లియర్ గా తీసేందుకు మాత్రమే శాంసంగ్ అల్ట్రా సిరీస్ స్మార్ట్‌ఫోన్లలోని కెమెరా యాప్ Ai డీప్ లెర్నింగ్ మోడల్ ను వినియోగిస్తుందని శాంసంగ్ స్పష్టం చేసింది. అయితే “సీన్ ఆప్టిమైజర్” ఫీచర్ ని ఆఫ్ చేసి కూడా ఫోటోలు తీయొచ్చు.
రెడిట్ యూజర్ ఆరోపణ ఇదీ..
ఇటీవల శాంసంగ్ గెలాక్సీ ఎస్23 జూమ్ లెన్స్‌లతో తీసిన చంద్రుని ఫోటోలను అందరూ ఆసక్తిగా చూశారు. కానీ వాటి ప్రామాణికతపై తనకు మొదటి నుంచే సందేహాలు ఉన్నాయని ఒక రెడిట్ యూజర్ చెప్పారు. అవి పూర్తిగా అసలైనవి కావని రెడిట్‌లో ibreakphotos అనే పేరు కలిగిన ఓ యూజర్ పోస్ట్ చేశారు. దానిపై అతడు పూర్తి వివరణ కూడా ఇచ్చారు.తాను ఇంటర్నెట్ నుంచి చంద్రుని హై రెజల్యూషన్ ఫొటోను డౌన్‌లోడ్ చేసి దాని సైజ్ తగ్గించి గాస్సియన్ బ్లర్‌ను అప్లయి చేశానని, దీంతో అస్పష్టంగా మారిందన్నారు. ఆ తర్వాత దాన్ని శాంసంగ్ స్పేస్ జూమ్ కెమెరాతో ఫొటో తీస్తే ఆ ఫొటో చాలా స్పష్టంగా వచ్చిందని తెలిపారు. కానీ అది అసలైన ఫొటో కాదని, ఇలా అస్పష్టంగా ఉన్న ఫొటో స్పష్టంగా చేసేందుకు శాంసంగ్ ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మోడల్‌ను ఉపయోగిస్తోందని ఆరోపించారు.
2021లోనూ ఇలాంటి ఆరోపణే..
Samsung Galaxy S21 Ultra తో ఫేక్ మూన్ ఫోటోస్ వచ్చాయంటూ 2021లో ఒక రిపోర్ట్ పబ్లిష్ అయింది. ఫోటోలు తీసే సమయంలో ఇమేజ్ ఓవర్‌లేయింగ్ లేదా టెక్చర్ ఎఫెక్ట్‌లు వర్తించవని శామ్‌సంగ్ అప్పట్లో చెప్పింది. చంద్రుడిని గుర్తించడానికి, ఆ ఫోటోను బెటర్ చేయడానికి.. బ్లర్ నెస్, శబ్దాన్ని తగ్గించడానికి AIని ఉపయోగిస్తామని ఆనాడు శామ్‌సంగ్ వివరణ ఇచ్చింది.
Also Read: Ponnambalam: నా తమ్ముడే నా పై విషం ప్రయోగం చేసాడు.. నటుడు పొన్నాంబలం సంచలన వ్యాఖ్యలు

Related News

WhatsApp: వాట్సాప్ డెస్క్ టాప్ లో సరికొత్త ఫీచర్స్.. అవేంటో తెలిస్తే వావ్ అనాల్సిందే!
ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది