Jio AirFiber: జియో సంచలనం: ఎయిర్‌ఫైబర్ వచ్చేసింది
టెలికాం రంగంలో రిలయన్స్ జియో తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. అందులో భాగంగా ఈ రోజు సెప్టెంబర్ 19న వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీసులను ప్రారంభించింది.
- Author : Praveen Aluthuru
Date : 19-09-2023 - 4:14 IST
Published By : Hashtagu Telugu Desk
Jio AirFiber: టెలికాం రంగంలో రిలయన్స్ జియో తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. అందులో భాగంగా ఈ రోజు సెప్టెంబర్ 19న వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీసులను ప్రారంభించింది. జియో ఎయిర్ ఫైబర్ ద్వారా ఎలాంటి బఫరింగ్ లేకుండా వీడియో స్ట్రీమింగ్, యూజర్లకు గేమింగ్, హై-క్వాలిటీ వీడియోలను చూడొచ్చు.
ఇది 5G టెక్నాలతో పని చేస్తుంది. 1జీబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ వేడంతో 5జీ డేటా వాడుకోవచ్చు. మారుమూల ప్రాంతాలకు కూడా సులువుగా ఇంటర్నెట్ సేవల్ని అందించవచ్చు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఫైబర్-ఆప్టిక్ కనెక్షన్ల కంటే ఎక్కువ స్పీడ్‌తో వీటి సర్వీసులు అందుబాటులో ఉంటాయి. యూజర్లు ఒకేసారి మల్టీ కనెక్షన్లు వాడుకోవచ్చు. ఇందులోని హైస్పీడ్ వల్ల ఇంటర్నెట్లో ఎలాంటి అంతరాయం ఉండదు. ప్రస్తుతం ఈ సేవలు దేశ రాజధాని ఢిల్లీతో పాటు, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై మరియు పూణేలలో అందుబాటులోకి తీసుకొచ్చింది.
రూ. 599 ప్లాన్ వినియోగదారులు అపరిమిత డేటా కోసం 30Mbps స్పీడ్ వర్తిస్తుంది. రూ.899 మరియు రూ.1199 ప్లాన్‌లతో వినియోగదారులు అపరిమిత డేటా కోసం 100Mbps స్పీడ్ సేవల్ని పొందుతారు. రూ. 599 ప్లాన్‌తో వినియోగదారులు 14 OTT యాప్‌ల సౌకర్యాన్ని పొందుతారు. రూ.899 మరియు రూ.1199 ప్లాన్‌లతో వినియోగదారులు 14 కంటే ఎక్కువ OTT యాప్‌ల సౌకర్యాన్ని పొందుతారు.
Also Read: Minister Botsa Satyanarayana : చంద్రబాబు నాయుడు భద్రత బాధ్యత ప్రభుత్వానిదే – మంత్రి బొత్స