Redmi: మార్కెట్ లోకి రెడ్‌మీ నోట్ 12 సిరీస్.. ధర, ఫీచర్స్ ఇవే?
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ కంపెనీ గురించి మన అందరికీ తెలిసిందే. రెడ్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో
- By Anshu Published Date - 07:00 AM, Tue - 27 December 22

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ కంపెనీ గురించి మన అందరికీ తెలిసిందే. రెడ్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లోనే విడుదల చేసింది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తోంది. ఈ క్రమంలోని తాజాగా మరో సరికొత్త ఫోన్ కూడా లాంచ్ చేయనుంది. రెడ్‌మీ భారత మార్కెట్లోకి రెడ్‌మీ 12 సిరీస్ ను లాంచ్ చేయనుంది. మొత్తం మూడు స్మార్ట్ ఫోన్‌లను తీసుకురానుంది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే నెల జనవరి 5న లాంచ్ కానుంది.
ఈ సిరీస్‌లో భాగంగా రెడ్‌మీ నోట్ 12, నోట్ 12 ప్రో, నోట్ 12 ప్రో ప్లస్ లాంటి మూడు స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తోంది రెడ్‌మీ సంస్థ. 2023 న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఈ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. జనవరి 5వ తేదీన రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్‌లో ఏకంగా 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాను అందిస్తోంది. రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ ఫోన్ ధర లీకైంది. ఈ సమాచారం ప్రకారం 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 24,999 కాగా ఉంది. అలాగే 8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 26,999 గా ఉంది. 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 28,999గా ఉంది.
కాగా ఈ సిరీస్‌లో వస్తోన్న ఫోన్‌లలో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ప్రో ప్లస్ లో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిఉండనుంది.