Redmi Note 12 Pro 5G: మార్కెట్ లోకి మరో రెడ్ మీ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ మాములుగా లేవుగా?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ కంపెనీ గురించి మన అందరికీ తెలిసిందే. రెడ్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన
- By Anshu Published Date - 07:00 PM, Fri - 11 August 23

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ కంపెనీ గురించి మన అందరికీ తెలిసిందే. రెడ్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ లతో అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా రెడ్ మీ సంస్థ మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. రెడ్ మీ నోట్ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లోని కొత్త వేరియంట్‌ని తీసుకువచ్చింది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ రోమ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ రోమ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్ 256 జీబీ రోమ్ వేరియంట్లతో ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్‌లో మరో కొత్త వేరియంట్ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. 12 జీబీ ర్యామ్,256 జీబీ రోమ్ సామర్థ్యంలో కొత్తగా విడుదల చేయబడిన రెడ్మీ నోట్ 12 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మోడల్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ఆ ప్రత్యేకతలు ఏంటి అన్న విషయానికి వస్తే.. రెడ్ మీ నోట్ 12 ప్రో 5జీ రెడ్ మీ స్మార్ట్‌ఫోన్‌లో మీరు 6.67 అంగుళాల పూర్తి HD ప్లస్ OLED డిస్‌ప్లే, 120 Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్, ఇది 240 Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌ను పొందుతారు. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కూడా డిస్‌ప్లే సెక్యూరిటీ కోసం అందించారు.
వేగం, ఇంకా మల్టీ టాస్కింగ్ కోసం ఈ రెడ్ మీ నోట్ 12 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 1080 ప్రాసెసర్ ఉపయోగించబడింది. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే.. ఫోన్ వెనుక ప్యానెల్‌లో 8 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా సెన్సార్‌తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ సోనీ IMX766 కెమెరా సెన్సార్ ఉన్నాయి. అలాగే వీడియో కాల్స్, సెల్ఫీ ఈ రెడ్మీ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 16 మెగా పిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది. 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉండనుంది. ఈ ఫోన్ కేవలం 15 నిమిషాల్లో 51 శాతం ఛార్జ్ అవుతుందట. అంటే 100 శాతం ఛార్జింగ్ 30 నిముషాల్లోనే పూర్తి చార్జ్ అవుతుంది.