Realme C67 5G: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న రియల్ మీ 5జి స్మార్ట్ ఫోన్?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఎ
- By Anshu Published Date - 09:25 PM, Thu - 14 December 23

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా కూడా రియల్‌మీ మార్కెట్ లోకి మరో స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ఆ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ తో వినియోగదాలను విపరీతంగా ఆకర్షిస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా రియల్ మీ సంస్థ రియల్ మీ సీ67 పేరుతో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ 6ఎన్‌ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌ను అందించారు.
ఇక ఏఐ ఆధారిత డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ ఫోన్ ను డార్క్ పర్పుల్, సన్నీ ఒయాసిస్ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999కాగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా ఉంది. కాగా డిసెంబర్ 16వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రిటైల్ స్టోర్స్‌లోకి కూడా అందుబాటులోకి రానుంది. డిసెంబర్ 20 తర్వాత ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి రూ. 1500 డిస్కౌంట్ అందించనున్నారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్, 680 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో ర్యామ్‌ను 6జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్ కూడిన రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక రియల్‌మీ సీ67 5జీ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే ఇందులో.. 33 వాట్స్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. కేవలం 29 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం ఛార్జింగ్ కావడం ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. 7.89 ఎన్‌ఎమ్ మందంతో అత్యంత సన్నగా ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. ఐపీ54 రేటింగ్ డస్ట్, స్ల్పాష్ రెసిస్టెన్స్‌ను ఇచ్చారు. సెక్యూరిటీ పరంగా చూస్తే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఇచ్చారు.