Realme 12: భారత్ లోకి మరో సరికొత్త రియల్ మీ స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు
- By Nakshatra Published Date - 09:59 PM, Fri - 8 March 24
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది రియల్ మీ సంస్థ. భారత మార్కెట్లోకి రియల్12 సిరీస్‌లో భాగంగా రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా రియల్మీ12, రియల్మీ 12+ ఫోన్లను లాంచ్ చేశారు. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
ఇకపోతే ధర విషయానికొస్తే.. రియల్మీ12 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,999కాగా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 17,999గా ఉంది. ఇక రియల్మీ12+ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 20,999 కాగా.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 21,999గా ఉంది. రియల్మీ 12 5జీ ఫోన్లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరా, సెల్ఫీలు వీడియో కాల్స్ కోంస 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్లో ప్రత్యేకంగా స్టీరియో స్పీకర్లను అందించారు.
అలాగే ఛార్జింగ్ విషయానికొస్తే ఇందులో 45W ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందిచారు. అలాగే.. దమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇక రియల్మీ 12+ 5G ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్హెచ్డీ+ స్క్రీన్‌ను అందించారు. ఇందులోన ప్రత్యేకంగా రెయిన్వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను ఇచ్చారు. 50 ఎంపీ రెయిర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే ఇందులో.. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.
Related News
Houthis Attack : భారత్‌కు వస్తున్న నౌకపై హౌతీల ఎటాక్
Houthis Attack : పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలంటూ యెమన్ దేశానికి చెందిన హౌతీ మిలిటెంట్లు ఎర్రసముద్రంలో విరుచుకుపడుతున్నారు.