Realme C53 Sale: మార్కెట్లో అదరగొడుతున్న రియల్ మీ స్మార్ట్ ఫోన్.. సెకండ్ కు 20 ఫోన్లు ఆర్డర్?
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా రియల్ మీ స్మార్ట్ ఫోన్ పేరు మారుమోగిపోతోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ ఫోన్ ని కొనుగోలు చేయడం కోస
- By Anshu Published Date - 07:00 PM, Thu - 20 July 23

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా రియల్ మీ స్మార్ట్ ఫోన్ పేరు మారుమోగిపోతోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ ఫోన్ ని కొనుగోలు చేయడం కోసం ఎగబడుతున్నారు. ఈ ఫోన్ లకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది అంటే సెకన్ కు 20 ఫోన్లు అమ్ముడు అయ్యాయి అంటే ఈ ఫోన్ కి ఉన్న ప్రత్యేకత క్రేజ్ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రియల్‌మి ఫోన్‌కు భారీ డిమాండ్ ఉంది. అదిరిపోయే ఫీచర్లు, అందుబాటు ధర కారణంగా జనాలు కూడా ఫోన్‌ను తెగ కొంటున్నారు. అందుకే సెకన్‌కు 20 ఫోన్లు విక్రయించబడుతున్నాయి. ఆ ఫోన్ మరేదో కాదు రియల్ మీ సీ53 స్మార్ట్ ఫోన్.
జూలై 19న ఈ ఫోన్ యార్లీ బర్డ్ సేల్ జరిగింది. ఫోన్‌కు భారీ డిమాండ్ కారణంగా జనాలు ఎగబడి మరీ ఈ ఫోన్ కొన్నారు. 108 ఎంపీ కెమెరాతో తక్కువ ధరలో లభించే ఫోన్ ఇదే అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ స్లిమ్‌గా ఉంది. 7.99 ఎంఎం మందంతో ఉంటుంది. ఇంకా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు ఉంది. అలాగే 12 జీబీ డైనమిక్ ర్యామ్ ఫీచర్ ఉంది. అలాగే మెమరీ 128 జీబీ వరకు ఉంటుంది. ఇంకా ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కూడా కలిగి ఉండనుంది. 18 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయెల్ రియర్ కెమెరా, వాటర్ డ్రాప్ నాచ్, ఆక్టో కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అంటే ఫోన్‌లో సూపర్ డూపర్ ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ స్క్రీన్ సైజ్ 6.74 ఇంచులతో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేయనుంది. వెనుక భాగంలో 108 ఎంపీ, 2 ఎంపీ డ్యూయెల్ కెమెరా ఉండొచ్చు. ఫోన్ ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు. 4 జీ సపోర్ట్ చేస్తుంది. అందువల్ల బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ కోరుకునే వారు ఈ ఫోన్‌ను ఒకసారి పరిశీలించవచ్చు. కాగా రియల్‌మి సీ53 ఫోన్ ధర విషయానికి వస్తే.. దీని రేటు 9,999 నుంచి ప్రారంభం అవుతోంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. అదే 6 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ విషయానికి వస్తే.. దీని రేటు రూ.10,999గా ఉంది. ఇది బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఫోన్ తర్వాతి సేల్ జూలై 26న ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో లేదా కంపెనీ వెబ్‌సైట్ ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.