HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Realme 11 Pro Series Launched In India First Sale Date Fixed

Realme 11 Pro Series: మార్కెట్లోకి మరో రియల్ మీ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ అదుర్స్?

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగద

  • Author : Anshu Date : 08-06-2023 - 9:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Realme 11 Pro Series
Realme 11 Pro Series

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది రియల్‌మీ సంస్థ. ఈ నేపథ్యంలోనే తాజాగా రియల్‌మీ సంస్థ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్‌మీ భారత్ లోకి రియల్‌మీ 11 ప్రో, రియల్ మీ 11 ప్రో ప్లస్ 5 జీ ఫోన్ లను విడుదల చేసింది. కాగా ఇప్పటికే రియల్ మీ 11 ప్రో సిరీస్ ఇతర దేశాల్లో మార్కెట్‌లో రిలీజ్ అయ్యాయి.

ముఖ్యంగా 200 ఎంపీ కెమెరా విషయంలో ఈ సిరీస్ ఫోన్లు తమ మార్క్‌ను చూపిస్తున్నాయి. తాజాగా ఈ ఫోన్‌ను భారతీయులకు పరిచయం చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. జూన్ 15న ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో, జూన్ 16న ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఇకపోతే ఈ ఫోన్ యొక్క ధర, ఫీచర్స్ విషయానికి వస్తే.. రియల్‌మీ 11 ప్రో సిరీస్‌లోని రెండు మొబైల్స్‌ 6.7 అంగుళాల కర్వ్‌డ్ అమొలెడ్ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ సపోర్ట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12జీబీ 256 జీబీ వేరియంట్‌లో వినియోగదారులను పలుకరించనుంది. అలాగే రియల్ మీ యూఐ 4.0తో పాటుగా ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో చాలా బాగా పని చేస్తుంది.

అలాగే ఈ రెండు వేరియంట్లల్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది. కాగా ప్రధానంగా రియల్‌మీ 11 ప్రో, రియల్‌మీ 11 ప్రో ప్లస్ మధ్య తేడాలు చూస్తే రియల్‌మీ 11 ప్రో మొబైల్‌కు 67వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అయితే రియల్‌మీ 11 ప్రో ప్లస్ మోడల్‌కు 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. రియల్‌మీ 11 ప్రో మొబైల్‌లో 100మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. రియల్‌మీ 11 ప్రో ప్లస్‌లో 200మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. రెండు ఫోన్ లలో 8మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్, 2మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. రియల్‌మీ 11 ప్రో ప్లస్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటే రియల్‌మీ 11 ప్రో మోడల్‌లో 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్ మీ 11 ప్రో 5జీ మూడు వెరియంట్ లలో లభించనుంది. 8 జీబీ 128 జీబీ ఫోన్ రూ.23,999 గా ఉంది. 8 జీబీ 256 జీబీ ఫోన్ రూ.24,999 గా ఉంది. 12 జీబీ+256 జీబీ రూ.27,999 గా ఉంది.. ఇకపోతే రియల్ మీ 11 ప్రో ప్లస్ 5జీ విషయానికి వస్తే 8 జీబీ+256 జీబీ ఫోన్ రూ.27,999 గా ఉంది.
12 జీబీ+256 జీబీ రూ.29,999 గా ఉంది..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Realme 11 Pro
  • Realme 11 Pro Plus
  • Realme 11 Pro Series

Related News

    Latest News

    • Weight : ఎప్పుడూ ఒకేలా మీ బరువు ఉండాలంటే మీరు ఇలా చేయాల్సిందే !!

    • Vaaranasi : ఇది మన టైం అంటూ మహేష్ అభిమానుల్లో జోష్ నింపిన రాజమౌళి

    • క‌రోనా కొత్త వేరియంట్‌.. చిన్న పిల్ల‌ల‌పై ప్ర‌భావం?

    • ఈసీ విష‌యంలో విప‌క్షాల‌కు బిగ్ షాక్‌..!

    • Cricket : ఒక్క రన్ ప్రాణం పోయేలా చేసింది !!

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd