Realme 11 5G: అదిరిపోయే కెమెరాతో మార్కెట్లోకి రియల్ మీ స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్స్ ఇవే?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసి
- By Anshu Published Date - 07:42 PM, Wed - 30 August 23

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రియల్‌మీ సంస్థ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్‌మీ 11 సిరీస్‌లో రిలీజ్ అయిన రియల్‌మీ 11 5జీ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో మొదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. రియల్‌మీ 11 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్ లలో లాంఛ్ అయింది. 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది.
అలాగే 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకు గ్లోరీ గోల్డ్, గ్లోరీ బ్లాక్ కలర్స్‌లో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్స్‌తో డిస్కౌంట్ పొందొచ్చు. నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. రూ.3,167 ఈఎంఐతో ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు. స్టాండర్డ్ ఈఎంఐ రూ.900 నుంచి ప్రారంభమవుతుంది. స్టాండర్డ్ ఈఎంఐలో వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేయాలనుకునేవారికి రూ.18,400 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ మీ పాత మొబైల్‌కు రూ.10,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభించినా మీరు చెల్లించాల్సింది రూ.10 వేల లోపే. రియల్‌మీ 11 5జీ మొబైల్‌ను రియల్‌మీ స్టోర్స్‌తో పాటు రియల్‌మీ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కొనొచ్చు.
రియల్‌మీ 11 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 13 + రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో డైనమిక్ ర్యామ్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో గరిష్టంగా ర్యామ్ 16జీబీ వరకు పెంచుకోవచ్చు. రియల్‌మీ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. 108మెగాపిక్సెల్ Samsung ISOCELL HM6 ప్రైమరీ సెన్సార్ + 2మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్‌మీ 11 5జీ మొబైల్2లో 5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్ 5.2, టైప్ సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. కేవలం 17 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయొచ్చు.